శ్రీశైల దేవస్థానం: శ్రీశైల దేవస్థానం గదుల నిర్మాణ పథకానికి దాతలు ఆదివారం విరాళాలను అందజేశారు.
వసతి నిర్మాణం పథకంలోని ‘ఎ’ గ్రేడ్ విరాళ పథకానికి విరాళాలను అందించారు. గంగుల ప్రభాకర్ రెడ్డి, ఎం.ఎల్.సి , ప్రభుత్వ విప్, గంగుల ప్రతాపరెడ్డి, నంద్యాల మాజీ పార్లమెంట్ సభ్యులు, గంగుల బ్రిజెంద్రరెడ్డి, ఎం.ఎల్.ఏ, ఆళ్ళగడ్డ రెండు వి.ఐ.పి కాటేజీలు (ఒక్కొక్కటి రూ.కోటి రూపాయలతో) రెండు కోట్లతో నిర్మించి దేవస్థానానికి అందజేసేందుకు అంగీకరించారు.ఇందుకు గాను ముందస్తుగా రూ.10 లక్షలకు సంబంధిత చెక్కును ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు వి. రామకృష్ణకు అందజేశారు.