శ్రీశైల దేవస్థానం: సుమిత్ గణపతి మోర్గ్, నాందేడ్, మహారాష్ట్ర వారు పలు వాయిద్య పరికరాలను దేవస్థానానికి శనివారం విరాళంగా అందజేశారు.వీటి విలువ సుమారు రూ. 1.20,660/-లు ఉంటుందని దాతలు తెలియజేశారు.
దాత అందజేసిన ఈ వాయిద్య పరికరాలను ఈ రోజు కార్యనిర్వహణాధికారి యం. శ్రీనివాసరావు దేవస్థానం నాదస్వర సిబ్బందికి అందజేశారు. శృతి, తాళం, డోలు పరికరాలు నాదస్వర పరికరాలను అందించారు.
కార్యక్రమములో ఆలయ విభాగం సహాయ కార్యనిర్వహణాధికారి యం. హరిదాసు, సంబంధిత గుమాస్తా వై. దివాకరరెడ్డి తదితర సిబ్బంది పాల్గొన్నారు.
