శ్రీశైల దేవస్థానానికి విరాళంగా రూ. 5,92,000/-లు విలువైన ఫోటో కెమెరా

శ్రీశైల దేవస్థానం:  బి. సాంబశివరావు, ప్రైమార్కు ఎంటర్‌ప్రైజెస్, హైదరాబాద్ , దేవస్థానానికి  ఫోటో కెమెరాను అందజేశారు. కార్యనిర్వహణాధికారి  ఎస్. ఎస్. చంద్రశేఖర ఆజాద్‌, శ్రీస్వామివార్ల ప్రధానార్చకులు, హెచ్. వీరయ్యస్వామి, సీనియర్ వేదపండితులు గంటి రాధకృష్ణ శర్మ, ప్రజాసంబంధాల అధికారి టి. శ్రీనివాసరావు సమక్షములో ఈ కెమెరాను దేవస్థానానికి అందించారు. ఈ కెమెరా , లెన్సుల విలువ సుమారు రూ. 5,92,000/-లు దాకా ఉంటుందని దాతలు పేర్కొన్నారు.
అనంతరం దాతలకు శ్రీస్వామిఅమ్మవార్ల శేషవస్త్రాలు, లడ్డుప్రసాదాలను అందించారు.

print

By Online News Diary

ONLINENEWSDIARY.COM - A Multilingual Online News Portal

Leave a Reply

Your email address will not be published.