
శ్రీశైల దేవస్థానం: టి. శ్రీనివాసరావు, ఒంగోలు సోమవారం శ్రీశైల దేవస్థానానికి వెండి నాగాభరణాన్ని విరాళంగా సమర్పించారు.
ఈ నాగాభరణం బరువు 3 కేజీల 150 గ్రాములు.
అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని ఆశీర్వచన మండపంలో దాతలు వీటిని వేదపండితులు గంటి -రాధకృష్ణ అవధాని, అమ్మవారి ఆలయం ఇన్స్పెక్టర్ కె. మల్లికార్జున, గుమాస్తా ఎం. సావిత్రికి అందజేశారు.
అనంతరం వీరికి తగు రశీదును అందజేసి వేదాశీర్వచనముతో శ్రీస్వామిఅమ్మవార్ల శేషవస్త్రాలను, ప్రసాదాలు అందించారు.
కార్యక్రమం లో పలువురు అర్చకస్వాములు, వేదపండితులు పాల్గొన్నారు.