
శ్రీశైల దేవస్థానం: లడ్డు ప్రసాదాలను మోసేందుకు వినియోగించే ట్రాలీలు దేవస్థానానికి విరాళంగా అందాయి. తలారి నవీన్ ముదిరాజ్, అమీనాపురం గ్రామం, సంగారెడ్డి గురువారం ఈ ట్రాలీలను విరాళంగా అందజేశారు. తల్లిదండ్రులు తలారి రాములు, శ్రీమతి వరలక్ష్మి పేరిట వీటిని అందించారు. వీటి విలువ రూ. 1,08,000/- ఉంటుందని దాత తెలిపారు. ఈ ఓ లవన్న తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.