శ్రీశైల దేవస్థానం: నూకల నటరాజ్, హైదరాబాద్ శనివారం 375 గ్రాములు 400 మిల్లీగ్రాముల బరువుగల లక్ష్మీ కాసుల బంగారు హారాన్ని దేవస్థానానికి సమర్పించారు.ఈ హారం విలువ సుమారు రూ. 24,41,433/- లని దాతలు పేర్కొన్నారు.
అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని ఆశీర్వచన మండపంలో దాతలు ఈ బంగారుహారాన్ని అమ్మవారి ఆలయ ప్రధానార్చకులు మార్కండేయస్వామి, ఆలయ సహాయ కార్యనిర్వహణాధికారి ఎం. హరిదాసు, అమ్మవారి ఆలయం ఇన్స్పెక్టర్ రామనాయుడులకు అందజేశారు.అనంతరం వారికి వేదాశీర్వచనముతో శ్రీస్వామిఅమ్మవార్ల శేషవస్త్రాలను, ప్రసాదాలు అందించారు.