
శ్రీశైల దేవస్థానం:భక్తుల వసతి సౌకర్యార్థం కుటీర నిర్మాణం పథకం కింద దేవస్థానం నిర్మిస్తున్న గణేశ సదనం లోని ఒక గది నిర్మాణానికి గురువారం విరాళం అందింది.హైదరాబాదు కు చెందిన మందాల మనోహర్ రావు, మందాల శ్రీనాథరావులు రూ.15,00,000లను డి.డి. రూపములో ధర్మకర్తల మండలి అధ్యక్షులు రెడ్డివారిచక్రపాణిరెడ్డి, కార్యనిర్వహణాధికారి ఎస్. లవన్న, ధర్మకర్తల మండలి సభ్యులకు అందజేశారు ఈ సందర్భంగా దాతకు స్వామివారి శేషవస్త్రం, ప్రసాదాలు అందించారు.