
శ్రీశైల దేవస్థానం: విశాఖపట్టణానికి చెందిన మురళీకృష్ణ దంపతులు బుధవారం
శ్రీ సోమాస్కంద మూర్తి ఉత్సవమూర్తులను దేవస్థానానికి బహూకరించారు.
ఈ సందర్భంగా ఈ విగ్రహాలకు శాస్త్రోక్తంగా పూజాదికాలు జరిగాయి.
ఉత్సవమూర్తులను దేవస్థాన ధర్మప్రచార రథ కార్యక్రమాలలో ఉపయోగిస్తారు.
అధ్యాపక ఎమ్. పూర్జానంద ఆరాధ్యులు, ఉపప్రధానార్చకులు
రాజశేఖరస్వామి, అసిస్టెంట్ కమిషనరు హెచ్.జి.వెంకటేష్, సహాయ కార్యనిర్వహణాధికారి
ఐ.ఎన్.వి. మోహన్ తదితరులు పాల్గొన్నారు.