
నంద్యాల:శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను దృష్టిలో ఉంచుకుని వాహనాల విషయంలో ఎస్పీ కొన్ని వివరాలు ప్రకటించారు. పండుగ రోజులలో వివిద రాష్ట్రాల నుంచి భక్తులు, వీఐపీలు భారీగా దైవదర్శనానికి తరలివస్తున్నారని దీనికి సంబంధించి, ముఖ్యంగా మహాశివరాత్రి రోజు 18 వ తేదీ రాత్రి 9 గంటల నుండి మర్నాడు 19 వ తేదీ ఉదయం 6.00 గంటల వరకు దోర్నాల నుండి శ్రీశైలం వైపు ఏ వాహనాలు అనుమతించబడవు.
19 వ తేదీ ఉదయం 6.00 గంటల నుండి రాత్రి 12.00 గంటలకు కర్నూలు లో నంద్యాల చెక్ పోస్ట్ దగ్గర వాహనాలు (లారీలు ) నిలుపుతారు. వాహనదారులు పోలీసు వారికి సహకరించగలరని ఎస్పీ కోరారు.
ఆంధ్రప్రదేశ్ నుండే కాక కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ, తమిళనాడు మొదలగు రాష్ట్రాల నుండి కూడా శ్రీశైలంనకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ట్రాఫిక్ అంతరాయం లేకుండా చర్యలు చేపట్టామన్నారు.18 నుండి 19 వరకు భారీ వాహనాల రాకపోకలు ఆత్మకూరు – దోర్నాల మీదుగా విజయవాడకు రాకపోకలు నిలిపివేస్తారు. 20 నుండి రాకపోకలు పునరుద్దరింపబడతాయని వివరించారు.
వాహనదారులు గమనించి లారీలు, భారీ గూడ్స్ వాహనాలు 18 నుండి 19వరకు కర్నూలు పట్టణంలో నంద్యాల చెక్ పోస్ట్ నుండి నంద్యాల, గిద్దలూరు, మార్కాపురం మీదుగా విజయవాడకు చేరుకోవలసిందిగా నంద్యాల ఎస్పీ కోరారు.