
శ్రీశైల దేవస్థానం: ధర్మకర్తల మండలి అధ్యక్షులు రెడ్డివారిచక్రపాణిరెడ్డి విద్యార్థులకు దుప్పట్లను పంపిణీ చేశారు. ధర్మకర్తల మండలి సభ్యులు మేరాజోత్ హనుమంత్ నాయక్, ప్రత్యేక ఆహ్వానితులు తన్నీరు ధర్మరాజు తదితరులు పాల్గొన్నారు.ఇందులో భాగంగా గురుకుల పాఠశాల, గంగాసదనం ప్రక్కగల గిరిజన ఆశ్రమ పాఠశాల, మేకలబండ ప్రాథమిక పాఠశాల తదితర విద్యాలయాలలో దుప్పట్లను పంపిణీ చేసారు.ఈ సందర్భంగా ధర్మకర్తల మండలి అధ్యక్షులు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్రెడ్డి జన్మదిన వేడుక సందర్భంగా 200 మంది విద్యార్థులకు దుప్పట్లను పంపిణీ చేశామన్నారు.