అసంఖ్యాకంగా దివ్యతీర్థాలు ఉన్న క్షేత్రం శ్రీశైలమహాక్షేత్రం-సామవేదం
శ్రీశైల దేవస్థానం:హిందూ ధర్మప్రచారం లో భాగంగా దేవస్థానం నిర్వహిస్తున్న బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖశర్మ ‘శ్రీశైల మహిమా విశేషాలు’ ప్రవచనాలలో శుక్రవారం ఆరో రోజు ప్రవచనాలు కొనసాగాయి.
ఈ కార్యక్రమానికి ముందుగా ఆలయ సంప్రదాయాన్ని అనుసరించి జ్యోతిప్రజ్వలన చేసారు. అనంతరం ప్రవచకులు ముందుగా క్షేత్రంలోని పుణ్యతీర్థాలు, కుండాలు మొదలైన వాటి గురించి వివరించారు. శ్రీశైలంలోని ఆలయప్రాంగణం, ఆలయ పరిసరాలలో చాలా అద్భుతమైన తీర్థాలు ఉన్నాయని, వాటి దివ్యత్వాన్ని పురాణాలు ఎంతగానో వర్ణించాయన్నారు.
ఈ పర్వత ప్రాంతంలో యుగాల నుండి కూడా ఎన్నో పుణ్యతీర్థాలు, వాటి చెంత సిద్ధలింగాలు ఉన్నాయని శ్రీశైలఖండం వంటి ప్రాచీన గ్రంథాలు వర్ణించాయన్నారు. మల్లికాకుండం, మనోహరకుండం, ఘంటాసిద్ధేశ్వరుని వద్ద చంద్రకుండం, సారంగేశ్వరతీర్థం మొదలైనవాటి గురించి స్కాందపురాణంలోని శ్రీశైలఖండం వివరించిందన్నారు.దేవప్రదతీర్థం, చరుకేశ్వరతీర్థం తీర్థాలు శ్రీశైలంలో ఉన్నట్లుగా పురాణాలు చెబుతున్నాయన్నారు. దివ్యతీర్థాలు అసంఖ్యాకంగా ఉన్న క్షేత్రం శ్రీశైలమహాక్షేత్రమన్నారు.
Post Comment