శివభక్త కథామృతం ప్రవచనం చేసిన బి. అపర్ణ, ఏలూరు

 శ్రీశైల దేవస్థానం:కార్తీక మాసోత్సవాల సందర్భంగా పలు ధార్మిక , సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు

చేసారు.మంగళవారం దేవస్థానం పక్షాన ఏర్పాటు చేసిన కార్యక్రమాలలో భాగంగా బి. అపర్ణ, ఏలూరు , శివభక్త కథామృతం అనే అంశంపై ప్రవచనం చేసారు. శివతత్యం, శివలీలా విశేషాలు, శివమహిమ, పలువురు శివభక్తుల కథలు మొదలైన అంశాలను వివరించారు. ప్రసంగానుసారంగా  శ్రీశైల దివ్యక్షేత్ర మహిమను కూడా వివరించారు.

రెండవ కార్యక్రమంలో  భాగంగా జాతీయ సాంస్కృతిక పరిశోధన , శిక్షణా సంస్థ (N.C.R.T) వారి సౌజన్యంతో డి. శ్రావణి, నిశృంఖల డాన్స్ అకాడమీ హైద్రాబాద్ వారిచే కూచిపూడి నృత్య ప్రదర్శన జరిగింది.

 నమశ్శివాయతే, కాలభైరవాష్టకం, లింగాష్టకం, బిల్వాష్టకం, శంబో తదితర గీతాలకు, స్తోత్రాలకు, అష్టకాలకు చలసాని లోహిత, భాస్కరమోహనబాలసాయి తదితరులు నృత్య ప్రదర్శన చేసారు.

print

Post Comment

You May Have Missed