పక్కా ప్రణాళికతో కోవిడ్ కట్టడి-కలెక్టర్ జి. వీరపాండియన్
*రోజుకు పది వేలు శాంపిల్స్ సేకరణ , 8వేల పరీక్షల నిర్వహణ
*కోవిడ్ అనంతర పరిణామాలను ఎదుర్కొనేలా ఏర్పాట్లు
*100% వ్యాక్సినేషన్ వ్యూహాల అమలు
*అన్లాక్ అనంతరం కేసులు పెరగకుండా అప్రమత్తం
*మూడవ దశ ముందే సంసిద్ధంగా ఉండాలి
*కమిటీ లకు దిశానిర్దేశం చేసిన కలెక్టర్
కర్నూల్ జూన్ 7: కర్నూలు జిల్లాలో కోవిడ్ కట్టడికి పక్కా ప్రణాళికతో చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ జి. వీరపాండియన్ అధికారులను ఆదేశించారు సోమవారం మధ్యాహ్నం కోవిడ్ ను జిల్లాలో పూర్తిస్థాయిలో కట్టడి చేసేందుకు ఏర్పాటుచేసిన 5 కమిటీల అధికారులతో కలెక్టర్ జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు.
జాయింట్ కలెక్టర్ (రెవిన్యూ, రైతు భరోసా) రామ సుందర్ రెడ్డి,జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) డాక్టర్ మనజీర్ జీలానీ సామూన్, జాయింట్ కలెక్టర్ (ఆసరా , సంక్షేమం) శ్రీనివాసులు, కర్నూలు నగర పాలక సంస్థ కమిషనర్ డి.కె.బాలాజీ, ట్రైనీ అసిస్టెంట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ ,డ్వామా పిడి అమర్నాథ్ రెడ్డి, కర్నూల్ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ జిక్కి, , డి ఆర్ ఓ పుల్లయ్య, జెడ్పి సీఈఓ వెంకటసుబ్బయ్య, డిఎమ్ హెచ్ ఓ రామగిడ్డయ్య, డిఆర్డీఏ పిడి వెంకటేశులు తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయా కమిటీలు టీం లీడర్లు తమ ప్రజెంటేషన్ ఇచ్చారు .
అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ శాంపుల్ కలెక్షన్ టెస్టింగ్ కు సంబంధించి ప్రతిరోజు పదివేల శాంపిల్స్ను సేకరించాలని అన్నారు. రోజుకు ఎనిమిది వేల టెస్టులు చేయాలన్నారు. ఫలితాలను కూడా 24 గంటల లోపు ప్రకటించాలన్నారు. శాంపుల్ సేకరణకు వీక్లీ శాంపిల్ కలెక్షన్ షెడ్యూల్ను ఖచ్చితంగా తయారు చేసుకుని, రెండు రోజుల ముందుగానే స్పెషల్ టీమ్స్కు అందజేయాలన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన విధంగా 19 రకాల టార్గెట్ గ్రూపులను ఎంపిక చేసుకొని వారికి టెస్ట్ లు చేయాలన్నారు. ఆదివారం ,సోమవారం కూడా టెస్ట్ నిర్వహించాలని కలెక్టర్ సూచించారు.
పోస్ట్ కోవిడ్ హెల్త్ మేనేజ్మెంట్ కు సంబంధించి కలెక్టర్ మాట్లాడుతూ కోవిడ్ అనంతర పరిణామాలను ఎదుర్కొనేలా చర్యలు తీసుకోవాలన్నారు. బ్లాక్ ఫంగస్ తదితర కేసులకు సంబంధించి ప్రస్తుతం ఎన్ని కేసులు ఉన్నాయి ,వచ్చే రెండు మూడు నెలలలో ఈ కేసులు ఎంత పెరిగే అవకాశం ఉంది , అందుకు అనుగుణంగా మందులు ఎన్ని కావాలి ,ఎంతమంది వైద్య సిబ్బంది అవసరం , బడ్జెట్ ఎంత కావాలి అన్న వివరాలను తయారు చేయాల ని టీం లీడర్ డాక్టర్ జిక్కిని ఆదేశించారు. అదేవిధంగా క్లినికల్ మేనేజ్మెంట్కు సంబంధించి ప్రోటోకాల్ ప్రకారం హాస్పిటల్లో ఎలా చేయాలి, పి.హెచ్.సి మెడికల్ ఆఫీసర్లు, సి హెచ్ సి డాక్టర్లు, ఏఎన్ఎంలు ,ఆశాలు ఏం చేయాలి, కేసులు ఎలా గుర్తించాలి గైడ్ లైన్స్ ను తయారు చేయాలన్నారు. అదే విధంగా కోవిడ్ అనంతర పరిణామాలను ఎలా ఎదుర్కోవాలి, ఎలాంటి ముందు జాగ్రత్తలు తీసుకోవాలి తెలుపుతూ అవగాహన కార్యక్రమాలను.
ఏర్పాటు చేయాలన్నారు.
100% వ్యాక్సినేషన్ సంబంధించి వల్నరబుల్ గ్రూప్ లు, ఏరియాస్ గుర్తించి ఆయా గ్రూపులు, ప్రాంతాల్లో పాజిటివిటీ , మరణ శాతాన్ని బట్టి వ్యాక్సినేషన్ వేసేలా చర్యలు తీసుకోవాలన్నారు.ఇండస్ట్రీస్ లో, ఉపాధి హామీ పనులు జరిగే ప్రాంతాఎల్లో, జనం ఎక్కువగా ఉండే ప్రాంతాలల్లో, రైతు బజార్లు, మహిళా సంఘాలు ,ఎంప్లాయిస్ ఇలా ఎక్కడైతే వైరస్ వ్యాప్తి కి ఎక్కువ అవకాశం ఉందో ఆ ప్రాంతాల్లో వ్యాక్సినేషన్ జరిగేలా ప్రణాళిక రూపొందించాలని నగరపాలక సంస్థ కమిషనర్ ను ఆదేశించారు
అన్లాక్ అనంతర పరిణామాల కు సంబంధించి వ్యూహాత్మకంగా చర్యలు తీసుకోవాలన్నారు. పెళ్లిళ్లు, అంత్యక్రియలు, సినిమా హాళ్లు తదితర అంశాలకు సంబంధించి area, సంఖ్య ను బట్టి బ్యాలెన్స్డ్ అప్రోచ్ తో ప్రణాళిక రూపొందించాలన్నారు.పరిశ్రమల యాజమాన్యాలు, వారి సిబ్బంది ,కుటుంబ సభ్యులకు వారే సొంత కోవిడ్ కేర్ సెంటర్లను క ఏర్పాటు చేసుకునే విధంగా సూచించాలన్నారు. ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్లు, ఆక్సిజన్ కాన్సెంట్రేటరులు, సొంత మెడికల్ టీం ,మౌలిక వసతులను ఏర్పాటు చేసుకునే విధంగా నిర్దేశించాలన్నారు.. ఈ కోవిడ్ కేర్ సెంటర్లకు డిప్యూటీ డీఎంహెచ్వోను ఇన్చార్జిగా ఉంచుతామన్నారు సూచించారు. ఈ మేరకు యాజమాన్యాలతో సమావేశం ఏర్పాటు చేయాలని పరిశ్రమల శాఖ జిఎం ను ఆదేశించారు.
థర్డ్ వేవ్ ప్రిపరేషన్కు సంబంధించి జిల్లాలో 8 లక్షల వరకు పిల్లలు ఉన్నార ని, ఇందులో 80 వేల మంది వ్యాధులు ఉన్న పిల్లలు ఉండే అవకాశం ఉందన్నారు. ఇందులో తీవ్రమైన వ్యాధులు ఉన్న పిల్లలను గుర్తించి వారికి తక్షణమే వైద్యసేవలు అందేవిధంగా ప్రణాళికలు రూపొందించాలన్నారు . మహిళా సంక్షేమ శాఖ, విద్యాశాఖ ఆధ్వర్యంలో శిశు సంక్షేమం జరుగుతోందన్నారు .ఈ శాఖల నుండి సమాచారం తీసుకోవాలన్నారు. ఈ శాఖల పరిధి లోనికి రాని పిల్లలు కూడా మరో 50 వేల వరకు ఉండొచ్చని, వారి వివరాలు కూడా సేకరించి, ముందస్తు ఏర్పాట్లు చేయాల్సిన అవసరం వుందన్నారు.
మూడో దశలో కేసుల సంఖ్య పెరిగే ప్రమాదం ఉన్నంద ని చెప్తున్నందున, అందుకనుగుణంగా మౌలిక వసతులు , సిబ్బంది నియామకం పీడియాట్రీషియన్ ల నియామకం, మెడిసిన్స్, ఇతర మెటీరియల్ అన్ని సమకూర్చుకునేందుకు చర్యలు తీసుకునేలా సవివరమైన కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని జాయింట్ కలెక్టర్ డెవలప్మెంట్ ను. ఆదేశించారు. జిల్లాలో అన్ని ఆసుపత్రుల్లో మౌలిక వసతుల ఏర్పాటుకు అంచనాలు తయారు చేయాలని ఏ పీ ఎస్ ఎన్ ఐ డి సి ఈ ఈ ని ఆదేశించారు.
ఆత్మకూరు,సున్నిపెంట, బనగానపల్లె తదితర దూర ప్రాంతాల ఆస్పత్రులను జిల్లా స్థాయి ఆస్పత్రులు గా తీర్చిదిద్దాలనీ కలెక్టర్ తెలిపారు..
Post Comment