
శ్రీశైలదేవస్థానం:భక్తుల సౌకర్యార్థం శ్రీశైలదేవస్థానం ఈ నెల 19న డయల్ యువర్ ఈఓ కార్యక్రమాన్ని నిర్వహించనుంది.రాష్ట దేవాదాయ కమిషనర్ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం జరుగనుంది.ఈ కార్యక్రమం లో ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు భక్తులు తమ సూచనలు, సలహాలను నేరుగా కార్యనిర్వహణాధికారి కి ఫోన్ ద్వారా తెలియజేయవచ్చు.
డయల్ యువర్ ఫోన్ కార్యక్రమం లో భక్తులు ఫోన్ నెం.08524-287111 ద్వారా తమ సలహాలను, సూచనలను తెలియజేయవచ్చు.
డయల్ యువర్ ఈఓ కార్యక్రమం ముగిసిన వెంటనే 12.00 గంటల నుంచి అన్ని విభాగాల యూనిట్ అధికారులు, పర్యవేక్షకులు తదితర సిబ్బందితో కార్యనిర్వహణాధికారి డయల్ యువర్ ఈఓ కార్యక్రమం లో భక్తులు తెలియజేసిన ఆయా అంశాలపై సమీక్షా సమావేశాన్ని కూడా నిర్వహిస్తారు.