శ్రీశైల దేవస్థానం:భక్తుల సౌకర్యార్థం దేవస్థానం రేపటి నుండి (22.12.2021) డయల్ యువర్ ఈ ఓ కార్యక్రమాన్ని ప్రారంభిస్తోంది.
రాష్ట్ర దేవదాయ కమిషనర్ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమము చేపడుతున్నారు.
ప్రతి బుధవారం రోజున ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు భక్తులు తమ సూచనలు, సలహాలను నేరుగా కార్యనిర్వహణాధికారి కి ఫోన్ ద్వారా తెలియజేయవచ్చు.
ఈ డయల్ యువర్ ఫోన్ కార్యక్రమములో భక్తులు ఫోన్ నెం.08524-287111కు చేయవలసి వుటుంది.
భక్తుల సౌకర్యార్థం దేవస్థానం పలు ఏర్పాట్లను చేస్తోంది. అదే విధంగా పలు అభివృద్ధి కార్యక్రమాలను కూడా చేపట్టారు.
ముఖ్యంగా భక్తులకు తగిన వసతి, సౌకర్యవంతమైన దర్శనం, అన్నప్రసాద వితరణ పలు అంశాల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు.
అదేవిధంగా వైద్య ఆరోగ్యపట్ల కూడా పలు చర్యలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా స్వచ్ఛ శ్రీశైలంలో భాగంగా పారిశుద్ధ్యానికి ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తోంది. క్షేత్ర సుందరీకరణకు కూడా ప్రణాళికబద్ధంగా ఆయా పనులు చేపడుతున్నారు.
భక్తులు ప్రతి బుధవారం జరిగే డయల్ యువర్ ఈఓ కార్యక్రమం లో సూచనలు, సలహాలతో అందుకు అనుగుణంగా సౌకర్యాలను మరింతగా పెంపొందించేందుకు చర్యలు తీసుకుంటారు.
బుధవారం రోజున డయల్ యువర్ ఈ ఓ కార్యక్రమం ముగిసిన వెంటనే 12.00 గంటల నుంచి అన్ని విభాగాల యూనిట్ అధికారులు, పర్యవేక్షకులు తదితర సిబ్బందితో సమీక్షా సమావేశం కూడా ఉంటుంది.
* Dial Your Eo