శ్రీశైల దేవస్థానం: డయల్ యువర్ ఈఓ కార్యక్రమంలో పలువురు భక్తులు పాల్గొన్నారు. భక్తుల సౌకర్యార్థం బుధవారం డయల్ యువర్ ఈఓ కార్యక్రమాన్ని నిర్వహించారు. సహాయ కమిషనర్ (ఇంచార్జి), సహాయ కార్యనిర్వహణాధికారి పి.నటరాజరావు ఈ కార్యక్రమం లో పాల్గొన్నారు.ఈ ఉదయం 11 గంటల నుండి 12 గంటల వరకు కార్యక్రమం జరిగింది.ఈ కార్యక్రమం లో అన్ని విభాగాల యూనిట్ అధికారులు, పర్యవేక్షకులు తదితర సిబ్బంది పాల్గొన్నారు.
దేవస్థానం పరిపాలనా విభాగం లోని సమీక్షా సమావేశ మందిరం లో జరిగిన ఈ కార్యక్రమ లో పలువురు భక్తులు కార్యాలయానికి ఫోన్ ద్వారా పలు సూచనలు, సలహాలు అందజేశారు. ఒంగోలు, గుంతకల్లు, నందికొట్కూరు, ఎమ్మిగనూరు, వెలుగోడు, పశ్చిమగోదావరి జిల్లా తదిర ప్రాంతాల నుంచి భక్తులు పాల్గొన్నారు.
పలువురు భక్తులు స్వామివారి స్పర్శదర్శనం గురించి వివరాలను అడిగారు. అందుకు అధికారులు మాట్లాడుతూ ప్రస్తుతం కోవిడ్ నివారణ చర్యలలో భాగంగా స్వామివారి స్పర్శదర్శనం నిలిపివేసి అలంకార దర్శనం మాత్రమే కల్పిస్తున్నామన్నారు.నందికొట్కూరు నుంచి ఒక భక్తుడు మాట్లాడుతూ శ్రీశైలక్షేత్రానికి కాలిబాట గురించి పలు సూచనలు చేసారు.వెలుగోడుకు చెందిన ఒక భక్తుడు మాట్లాడుతూ గ్రంథాలయాలకు శ్రీశైలప్రభ చందా వివరాలు అడిగి తెలుసుకున్నారు.మరికొంత మంది భక్తులు శివసేవ (వాలంటరీ సేవ) గురించి అడిగి తెలుసుకున్నారు.