
శ్రీశైలదేవస్థానం:ధ్వజావరోహణ సంప్రదాయరీతిన జరిపారు. బ్రహ్మోత్సవాలలో భాగంగా గురువారం సాయంకాలం ధ్వజావరోహణ కార్యక్రమం నిర్వహించారు.ఈ ధ్వజావరోహణ కార్యక్రమంలో, ఉత్సవాల మొదటిరోజున బ్రహ్మోత్సవ ప్రారంభ సూచకంగా ఆలయ ప్రధాన ధ్వజస్తంభంపై ఆవిష్కరింపజేసిన ధ్వజపటం అవరోహణ చేసారు.