శ్రీశైల దేవస్థానం:శ్రీశైల దేవస్థానం లోకకల్యాణార్థం ముఖ్యంగా అందరికీ సంపూర్ణ ఆయురారోగ్యాలు సిద్ధించేందుకు డిసెంబరు 2వ తేదీన కార్తిక బహుళ త్రయోదశిన ‘ ధన్వంతరి జయంతి’ ని పురస్కరించుకుని ధన్వంతరి హోమం ,ఆయుష్ హోమం నిర్వహిస్తుంది.
రాష్ట్ర దేవదాయ ధర్మదాయశాఖ ఆదేశాల మేరకు ఈ పూజాదికాలు వుంటాయి.
ఆలయ ప్రాంగణములోని అమ్మవారియాగశాలలో గురువారం ఉదయం 8గంటల నుండి ధన్వంతరి హోమం, ఆయుషు హోమం,ధన్వంతరి మంత్రపారాయణలు నిర్వహిస్తారు. భక్తులందరు ఈ కార్యక్రమానికి విచ్చేసి తరించవలసిదిగా దేవస్థానం కోరింది.