
కర్నూలు, జూలై 16 :-తొలిసారి కర్నూలు జిల్లా పర్యటనకు (16-07-2021) న ఉదయం విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ జ్యుడీషియల్ సభ్యులు దండే సుబ్రహ్మణ్యం ను జిల్లా కలెక్టర్ జి వీరపాండియన్ , జాయింట్ కలెక్టర్ (రెవిన్యూ , రైతు భరోసా) రామ సుందర్ రెడ్డి స్టేట్ గెస్ట్ హౌస్ లో మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించారు. డి ఆర్ ఓ పుల్లయ్య, ఆర్ డి ఓ హరిప్రసాద్, కర్నూలు రూరల్ తహసీల్దార్ వెంకటేష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.
*ఆదోని డివిజన్ చిప్పగిరి మండలం లో రూ.53 కోట్లతో నగరడోణ రిజర్వాయర్ కు భూమి పూజ చేసి, పైలాన్ ను ఆవిష్కరించిన రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం.అనంతరం ఏర్పాటు చేసిన సభలో ప్రసంగిస్తున్న మంత్రి గుమ్మనూరు జయరాం. పాల్గొన్న ఆదోని ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి, కర్నూలు నగర మేయర్ బి.వై.రామయ్య, ఆర్ డి ఓ రామకృష్ణారెడ్డి, డీఎస్పీ వినోద్ కుమార్ తదితరులు.