×

మనో వికాసంగా భక్తిరంజని , సంప్రదాయ నృత్య ప్రదర్శన కార్యక్రమాలు

మనో వికాసంగా భక్తిరంజని , సంప్రదాయ నృత్య ప్రదర్శన కార్యక్రమాలు

శ్రీశైల దేవస్థానం: ధర్మపథంలో భాగంగా (నిత్యకళారాధన కార్యక్రమం) మంగళవారం   శ్రీమతి పద్మకళ్యాణి , బృందం, హైదరాబాద్ వారు  భక్తిరంజని , సంప్రదాయ నృత్య ప్రదర్శన కార్యక్రమాలు సమర్పించారు.

ఆలయ దక్షిణ మాడవీధిలోని నిత్యకళారాధన వేదిక వద్ద సాయంకాలం నుండి ఈ భక్తిరంజని , సంప్రదాయ నృత్య కార్యక్రమాలు జరిగాయి.

 వాతాపి గణపతిం, కైలాసగిరి నుండి, ఆనందనర్తన, విజయాంబికే, శివుడు తాండవమాడే తదితర గీతాలను అక్షర, అభిజ్ఞ, నందిక, శృతి, కళాంజలి, విరాజిత, కేదారేశ్వరి, జీవన్ తదితరులు ఆలపించారు.

ఈ కార్యక్రమానికి  బి.వి.ఎన్. ఇందు మోహన్,  బి.ఎస్.ఆర్. చైతన్య కౌషిక్ సహకారాన్ని  అందించారు.

 సంప్రదాయ నృత్య ప్రదర్శనలో భాగంగా మూషిక వాహన, భో…శంభో, శివ తాండవం, శంభో శివ శంభో తదితర గీతాలకు వి. శృతికల్యాణ్, నవ్య, లహరి, జానకిశృతి, చక్రిక, ఆద్య, నాగదీక్షిత, లక్షణ్య తదితరులు నృత్య ప్రదర్శన చేసారు.

రెండో  కార్యక్రమం లోసి. హెచ్. అర్చనప్రియ , బృందం, విజయనగరం వారు సంప్రదాయ నృత్య ప్రదర్శన కార్యక్రమం సమర్పించారు.

 శ్రీ స్వామిఅమ్మవార్లకు ఆయా కైంకర్యాలన్నీ పరిపూర్ణంగా జరగాలని , ప్రాచీన సంప్రదాయ కళల పరిరక్షణలో భాగంగా ఈ ధర్మపథం ఏర్పాటు అయింది.

print

Post Comment

You May Have Missed