శ్రీశైల దేవస్థానం: ధర్మపథంలో భాగంగా (నిత్య కళారాధన కార్యక్రమం) శనివారం చతుర్వేదుల శోభ , బృందం, నందిగామ వారు భక్తిరంజని కార్యక్రమం సమర్పించారు. వాతాపి గణపతిం, ఉమామహేశ్వర కుమార వరదే, శివధ్యాన సాగరమే చేరుమా, శివ శివ శంకరా, శంభోశంకర తదితర గీతాలను సి.హెచ్. శోభ, పి. రాధిక, యస్. రాజ్యలక్ష్మి గౌరి తదితరులు శ్రావ్యంగా గానం చేసారు. ఫ్లూట్ సహకారాన్ని కుమార్, మృదంగ సహకారాన్ని జగన్మోహిని అందించారు.