శ్రీశైల దేవస్థానం: ధర్మపథంలో భాగంగా (నిత్యకళారాధన కార్యక్రమం) సోమవారం శ్రీమతి యం. లక్ష్మి శ్యామల , వారి బృందం, పామర్రు, కృష్ణా జిల్లా భక్తిరంజని కార్యక్రమం సమర్పించారు .ఆలయ దక్షిణ మాడవీధిలోని నిత్యకళారాధన వేదిక వద్ద ఈ రోజు సాయంకాలం నుండి ఈ భక్తిరంజని కార్యక్రమం జరిగింది.
ఈ కార్యక్రమములో గణేశ పంచరత్నాలు, కంజదళాయతాక్షి, పంచాషట్ పీఠరూపిణి, శంభోశంకర, శంకరా చంద్రశేఖర, శంభో శివశంకరా, ఓంకార రూపిణి, భో…శంభో శివశంభో తదితర తదితర పలు శివకీర్తనలను యం. లక్ష్మీ శ్యామల తదితరులు ఆలపించారు.
కాగా ఈ నిత్య కళారాధనలో ప్రతిరోజూ హరికథ, బుర్రకథ, సంప్రదాయ నృత్యం, వాయిద్య సంగీతం, భక్తిరంజని లాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు.
శ్రీ స్వామిఅమ్మవార్లకు ఆయా కైంకర్యాలన్నీ పరిపూర్ణంగా జరగాలని , ప్రాచీన సంప్రదాయ కళల పరిరక్షణలో భాగంగా ఈ నిత్యకళారాధన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
