శ్రీశైల దేవస్థానం:శ్రీశైల దేవస్థానం నిర్వహిస్తున్న ధర్మపథంలో భాగంగా(నిత్య కళారాధన కార్యక్రమం) శనివారం గుండ్లపల్లి వాణి (U.S.) భక్తి సంగీత విభావరి కార్యక్రమం సమర్పించింది.ఆలయ దక్షిణ మాడవీధిలోని నిత్యకళారాధన వేదిక వద్ద సాయంకాలం నుండి కార్యక్రమం జరిగింది. గణపతి ప్రార్ధన, శ్రీశైలవాస, పలు అష్టకాలను, భక్తి గీతాలను శర్వాణి తదితరులు ఆలపించారు.
ఆదివారం సాంస్కృతిక కార్యక్రమాలు:
వి.భారతి దేవి బృందం, విజయవాడ సంప్రదాయ నృత్యం ప్రదర్శన కార్యక్రమం వుంటుంది.