
మచిలీపట్నం: మచిలీపట్నం టౌన్, బచ్చుపేట లో వేంచేసివున్న శ్రీ భ్రమరాంబా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానం లో నంది మండపం ప్రారంభించిన సందర్భంగా .15-03-2022 తేది, మంగళవారం ఉదయం గం.9-00 ల నుండి వేద సభ జరుగుతుందని కార్యనిర్వహణాధికారి తెలిపారు. ధర్మకర్తల మండలి సభ్యులు, అందరూ పాల్గొనాలని కోరారు.
జగజ్యోతి” కార్యక్రమం:
స్వామి వారి కల్యాణోత్సవాల సందర్భముగా “జగజ్యోతి” కార్యక్రమం చల్లా శ్రీరామ చంద్ర మూర్తి,
జయలక్ష్మి దంపతులచే జరిగింది. బ్రహ్మశ్రీ రాళ్ళపల్లి ఆంజనేయ శాస్త్రి బ్రహ్మత్వములో, జోస్యుల రాంప్రసాద్ పర్యవేక్షణలో, భక్త బృందం కార్యదర్శి, ధర్మకర్తల మండలి సభ్యులు అన్నంభట్ల బ్రహ్మానంద శాస్త్రి , ఏడు నూతల సురేష్ బాబు శర్మ, అర్చకులు ఘంటసాల బాలకృష్ణ నేతృత్వంలో కార్యక్రమం జరిగింది. వ్యవస్థాపక ధర్మకర్త ముత్తేవి రవికాంత్, కార్యనిర్వహణాధికారి సమ్మెట ఆంజనేయ స్వామి పర్యవేక్షణలో వివిధ కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం భక్తులకు ప్రసాద వితరణ జరిగింది.
- చిత్రావళి, సోమవారం కార్యక్రమాలకు సంబంధించినవి .