×

ఎస్. నిరుపమ , బృందం, ప్రొద్దుటూరు  భక్తి సంగీత కార్యక్రమం

ఎస్. నిరుపమ , బృందం, ప్రొద్దుటూరు  భక్తి సంగీత కార్యక్రమం

శ్రీశైల దేవస్థానం:  ధర్మపథంలో భాగంగా (నిత్యకళారాధన కార్యక్రమం) సోమవారం   ఎస్. నిరుపమ , వారి బృందం, ప్రొద్దుటూరు  భక్తి సంగీత కార్యక్రమం సమర్పించారు.

ఆలయ దక్షిణ మాడవీధిలోని నిత్యకళారాధన వేదిక వద్ద  సాయంకాలం  ఈ భక్తి సంగీత కార్యక్రమం ఏర్పాటు అయింది.

ఈ కార్యక్రమంలో  గణపతి నమో నమ:, జయరామ లింగేశ్వర, శివపంచాక్షరి, నాలోన శివుడు గలడు, కాశీవిశ్వనాధాష్టకం, తదితర శివాష్టకం, శివస్తోత్రం మొదలైన పలుగీతాలు, అష్టకాలు మొదలైనవాటిని ఎస్. నిరుపమ, కె. లక్ష్మీ అనూష, ఎస్. సాయికీర్తి, జ్యోతి ఆలపించారు.

ఈ కార్యక్రమానికి వయోలిన్ సహకారాన్ని నాగేశ్వరరావు, మృందంగ సహకారాన్ని హరికృష్ణ అందించారు.

శ్రీ స్వామిఅమ్మవార్లకు ఆయా కైంకర్యాలన్నీ పరిపూర్ణంగా జరగాలని , ప్రాచీన సంప్రదాయ కళల పరిరక్షణలో భాగంగా ఈ నిత్యకళారాధన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

print

Post Comment

You May Have Missed