
శ్రీశైల దేవస్థానం: ధర్మపథంలో భాగంగా (నిత్య కళారాధన కార్యక్రమం) శనివారం శ్రీ నృత్య కీర్తన సంగీత అకాడమీ, హైదరాబాద్ భక్తి రంజని కార్యక్రమం సమర్పించింది.ఆలయ దక్షిణ మాడవీధిలోని నిత్యకళారాధన వద్ద ఈ రోజు సాయంకాలం కార్యక్రమం జరిగింది.
కార్యక్రమం లో పాహి పాహి గజానన, నమ: శివాయ, ఎందుకయా సాంబశివ, కాళీ మహేశ్వరి, శివం భజే భవం భజే, శివ శివ భవ శరణు, ఆదిదేవ మహాదేవ, అమ్మలగన్న అమ్మ తదితర గీతాలను అనురాధ, శ్రావణి, రాధ, ప్రీతి, ఉదయరాణి, కీర్తన, శ్రీదేవి తదితరులు ఆలాపించారు.
నిత్య కళారాధనలో హరికథ, బుర్రకథ, సంప్రదాయ నృత్యం, వాయిద్య సంగీతం, భక్తిరంజని లాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు.
శ్రీ స్వామి అమ్మవార్లకు ఆయా కైంకర్యాలన్నీ పరిపూర్ణంగా జరగాలని, ప్రాచీన సంప్రదాయ కళల పరిరక్షణలో భాగంగా ఈ ధర్మపథం కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.