
శ్రీశైలానికి భక్త బృందాలు: 13 Mar.2026
ఉచిత బస్సు సదుపాయం
ఉగాది మహోత్సవాల సందర్భంగా వేలాది మంది భక్తులు క్షేత్రానికి చేరుకుంటున్నారు.
భక్తులు సౌకర్యార్థం వారు దిగినచోటు నుంచి ఆయా ప్రదేశాలు వెళ్ళేందుకు దేవస్థానం ఉచిత బస్సు సదుపాయాన్ని కల్పించింది.
ఈ బస్సులు కైలాసద్వారం నుండి శ్రీశైలం వరకు నడుపుతున్నారు. అదేవిధంగా నందిగుడి సర్కిల్ నుంచి ప్రారంభమై గణేశసదన్, సెంట్రల్ పార్కింగ్, విభూతిమఠం జంక్షన్, మల్లమ్మకన్నీరు, శివాజీస్ఫూర్తికేంద్రం, రుద్రాపార్కు, సిద్ధరామప్పకొలను, పాతాళగంగరోడ్డు, ప్రైవేటు సత్రాల మీదుగా మరల నందిగుడి సర్కిల్‌కు చేరుకుంటాయి.
అలాగే భక్తుల సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకుని శిఖరేశ్వరం నుంచి కూడా బస్సును శ్రీశైలానికి బస్సును నడుపుతున్నారు.
కాగా భక్తులరద్దీని బట్టి ఈ రోజు ( 13.03.2026) నుండి 15వ తేదీ వరకు 6 ఉచిత బస్సులు నడుస్తున్నాయి.
16వ తేదీ నుంచి 19వ తేదీ వరకు కూడా ఎనిమిది బస్సులను నడుపుతారు

