
*కమాండ్ కంట్రోల్ రూమ్ నుండి యుద్ధ ప్రాతిపదికన సేవలు*
*మెడికల్ వైద్య శిబిరాలలో ఉచిత పరీక్షలు, మందుల పంపిణీ*
శ్రీశైలం / నంద్యాల, ఫిబ్రవరి 18:-ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన శ్రీమల్లికార్జునస్వామివారు, అష్టాదశశక్తి పీఠాలలో ఒకరైన శ్రీభ్రమరాంబాదేవి అమ్మవారు కలిసివెలిసిన శ్రీశైలమహాక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో ఈ నెల 11 నుండి 17వ తేదీ వరకు ఐదున్నర లక్షల మంది, మహాశివరాత్రి పర్వదినమైన శనివారం రోజు దాదాపు రెండున్నర లక్షల మంది భక్తులు హాజరై శ్రీస్వామిఅమ్మవార్లను దర్శించుకున్నారు. జిల్లా కలెక్టర్ డా. మనజీర్ జిలాని సామూన్ ఆధ్వర్యములో 12 జోన్లుగా విభజించిన శ్రీశైలం క్షేత్రంలో జిల్లా ఉన్నతాధికారులను నియమించి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకుని ఏర్పాట్లు చేశారు.
ప్రధానంగా పారిశుధ్యం, త్రాగునీరు, పార్కింగ్ ప్రదేశాలు, భక్తుల ఉచిత దర్శన క్యూలైన్లు, లడ్డు ప్రసాద కౌంటర్లు, పార్కింగ్ ప్రదేశాలు శివదీక్షా శిబిరాలు, ఉద్యానవనాలు తదితర ముఖ్య ప్రదేశాలలో చలువపందిర్లు ఏర్పాటు చేశారు. కాలినడకన వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా దారిపోడవునా వైద్యశిబిరాలు, మంచినీటిసౌకర్యాలు ఏర్పాటు చేశారు.
శివరాత్రి బ్రహ్మోత్సవాలకు హాజరైన భక్తుల నుంచి 49 ఫిర్యాదులు కమాండ్ కంట్రోల్ రూమ్ వచ్చయాని, వీటన్నింటనీ యుద్ధప్రాతిపదికన సంబంధిత అధికారులకు చేరవేసి ఫిర్యాదుదారుల సమస్యలను పరిష్కరించినట్లు జిల్లా కలెక్టర్ జిల్లా కలెక్టర్ డా. మనజీర్ జిలాని సామూన్ తెలిపారు. ఇందులో ప్రధానంగా ఈ నెల 17వ తేదీ షంషాబాద్ నుండి ఇంట్లో చెప్పకుండా వచ్చిన అమ్మాయి నందిసర్కిల్, బస్టాండ్ సమీపంలో ఆకతాయి వ్యక్తులు పరిహసిస్తున్నట్లు కంట్రోల్ రూమ్ కు సమాచారం అందించగా వెంటనే పోలీసులకు సమాచారమిచ్చి వివరాలు తెలుసుకుని వారి తల్లిదండ్రులకు సమాచారం అందించి తదుపరి 6 గంటల అనంతరం వారి తల్లిదండ్రులకు అప్పగించడం జరిగింది. శనివారం మరో అమ్మాయి తప్పిపోయినట్లు వారి తల్లిదండ్రుల నుండి ఫిర్యాదు రాగానే పోలీసులకు సమాచారం అందించి వివరాలు తెలుసుకుని వెంటనే అమ్మాయి తల్లిదండ్రులకు అప్పగించడం జరిగింది. పారిశుద్ధ్యానికి సంబంధించి చండీశ్వర సదన్ లోని చిల్డ్రన్ పార్కు, నందిసర్కిల్ బస్టాండ్ సమీపంలో మరియు సాక్షిగణపతి ఆలయం వద్ద పారిశుద్ధ్య చర్యలు చేపట్టవలసినదిగా కంట్రలో రూమ్‌కు సమాచారం అందగానే సంబంధిత జోనల్ అధికారులకు సమాచారం అందించి వెంటనే పారిశుద్ధ్య చర్యలు చేపట్టారు.
శనివారం అన్నప్రసాద వితరణ క్యూలైన్లో రంగన్న అనే వ్యక్తికి పక్షపాతం సోకగా వెంటనే సమీప వైద్యశిబిరంలో చికిత్సలు నిర్వహించి అంబులెన్స్ రాగానే 15 నిమిషాలలో ఆసుప్రతిలో చేర్పించారు. ఈ నెల 17వ తేదీ రాత్రి 11.21 గంటలకు చస్ట్ పెయిన్ తో మహిళ కమాండ్ కంట్రోల్ రూముకు ఫోన్ చేయగా తక్షణమే దేవస్థాన ఆసుప్రతికి తరలించి వైద్య చికిత్సలు నిర్వహించారు. దీంతో పాటు హెల్ప్ లైన్ అయిన ఆర్.డి.ఓ. మీడియా, ఫైర్, ఏపీ.ఎస్.పి. డీ.సి. ఎల్ పాయింట్లకు ఫోన్ చేసి స్టేటస్ తెలుసుకుని సంబంధిత అధికారులకు సమాచారం ఇచ్చి యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకున్నారు.
నంద్యాల జిల్లా పరిధిలోని బ్రాహ్మణకొట్కూరు నుండి శ్రీశైల దేవస్థానం వరకు 13 చోట్ల వైద్యశాఖ ఆధ్వర్యములో ప్రథమచికిత్సా కేంద్రాలు నిర్వహించి వైద్యసేవలను అందించారు. శ్రీశైలక్షేత్ర పరిధిలో 12 చోట్ల తాత్కాలిక అత్యవసర ప్రథమచికిత్స కేంద్రాలతో పాటు 30 పడకల ఆసుప్రతి ఏర్పాటు చేసి వైద్యసదుపాయాలు కల్పించారు. దేవస్థాన వైద్యశాలలో 3 షిష్టులలో నిపుణులైన వైద్యబృందంచే చికిత్సలు అందించారు. భక్తులకు అత్యవసర సేవలు అందించడం కోసం ఎనిమిది 108 వాహనాలు, అవసరమైన వారికి ఈసిజీ పరీక్షలు కూడా చేశారు.
ఇప్పటి వరకు ప్రథమచికిత్సా కేంద్రాలు, ప్రత్యేక ఆసుపత్రుల ద్వారా 57,463 మంది భక్తులకు చికిత్సలు నిర్వహించారు. ఇందులో 263 మందిని ఆసుపత్రిలో చేర్చుకుని మెరుగైన చికిత్సలు అందించారు. 19 మంది రోగులకు మెరుగైన వైద్యం కోసం పై స్థాయి ఆసుపత్రులకు తరలించారు. 16 మందికి ఈసిజీ పరీక్షలు, 532 మందికి చక్కెరవ్యాధి పరీక్షలు నిర్వహించారు.
క్షేత్రపరిధిలోని అన్ని ప్రాంతాలలో దాదాపు వెయ్యి మందికిపైగా పారిశుద్ధ్య కార్మికులతో మూడు షిప్టులలో నిరంతరాయంగా పారిశుద్ధ్య చర్యలు చేపట్టారు. మంచినీటి కొరత లేకుండా ఎప్పటికప్పుడు ట్యాంకర్లతో నీటిసరఫరా చేశారు.
మహాశివరాత్రి ఉత్సవాలలో జిల్లా యంత్రాంగం, దేవస్థానం అధికారులు పరస్పర సహాయారంతో నిరంతరంగా అప్పగించిన విధులను నిర్వహించి బ్రహ్మోత్సవాలను చేశామని జిల్లా కలెక్టర్ డా. మనజీర్ జిలాని సామూన్ వెల్లడించారు.