
శ్రీశైల దేవస్థానం:దేవస్థానంలో మంగళవారం 77వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా
నిర్వహించారు.కార్యనిర్వహణాధికారి ఎస్.లవన్న ధర్మకర్తల మండలి సభ్యులు ఓ. మధుసూదన్‌రెడ్డి,
శ్రీమతి ఎం. విజయలక్ష్మి పలు విభాగాల అధికారులు, సిబ్బంది ఈ కార్యక్రమం లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా దేవస్థాన పరిపాలనా కార్యాలయ భవన ప్రాంగణంలో జాతీయ పతాకావిష్కరణ
కార్యక్రమం నిర్వహించారు. కార్యాలయం వద్ద ముందుగా ఆలయసం ప్రదాయాన్ని అనుసరించి
మహాగణపతిపూజ జరిపారు. తరువాత జాతిపిత మహాత్మాగాంధీ చిత్రపటానికి పుష్పమాల
అర్పించారు.అనంతరం దేవస్థానంలో విధులు నిర్వహిస్తున్న స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ సిబ్బంది పతాక వందనం
చేశారు. ఆ తరువాత కార్యనిర్వహణాధికారి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం జాతీయగీతం
ఆలాపించారు.అనంతరం కార్యనిర్వహణాధికారి లవన్న ప్రసంగిస్తూ గత సంవత్సర కాలం లో దేవస్థానం సాధించిన
ప్రగతిని వివరించారు.
ఈ ఓ దేవస్థానం అభివృద్ధిని వివరిస్తూ, రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి, రాష్ట్ర ఉపముఖ్యమంత్రి , దేవదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ , స్థానిక పార్లమెంట్ సభ్యులు పోచా బ్రహ్మానందరెడ్డి , స్థానిక శాసనసభ్యులు శిల్పాచక్రపాణి రెడ్డి , దేవదాయశాఖ ముఖ్యకార్యదర్శి కరికాల వలవన్, దేవదాయ కమిషనర్
ఎస్. సత్యనారాయణ, దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షులు చక్రపాణిరెడ్డి, ధర్మకర్తల
మండలి సభ్యులు దేవస్థానం అభివృద్ధికి మార్గదర్శకత్వం చేస్తూ ఎప్పటికప్పుడు ప్రోత్సహిస్తూ పూర్తి సహాయ
సహకారాలను అందిస్తున్నారన్నారు.ఈ సందర్భంగా దేవస్థానం పక్షాన వారికి ధన్యవాదాలు తెలియజేశారు. వైదిక కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించడం, భక్తులకు సౌకర్యాల
కల్పన, క్షేత్రాభివృద్ధికి అనే త్రిముఖ వ్యూహంతో దేవస్థానం ముందుకెళ్తుందన్నారు.
ఒకవైపు అభివృద్ధి కార్యక్రమాలతోపాటు మరోవైపు శ్రీశైలక్షేత్రాన్ని మరింత అధ్యాత్మిక కేంద్రంగా
తీర్చిదిద్దేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు.ఆ తరువాత ధర్మకర్తల మండలి సభ్యులు ఓ. మధుసూదన్‌రెడ్డి ప్రసంగించారు.
కార్యక్రమం లో భాగంగా పతావిష్కరణ తరువాత సాయిలలిత, కూచిపూడి నృత్య నికేతన్,
నెల్లూరు వారు దేశభక్తి గేయానికి సంప్రదాయ నృత్యాన్ని ప్రదర్శించారు. ఈ సందర్భంగా దేవస్థానంలో విధులు నిర్వహిస్తున్న పారిశుద్ధ్య సిబ్బందికి సమస్థాయి వస్తాలను (యూనిఫార్మ్ డ్రస్) దేవస్థానం తరుపున అందించారు.