శ్రీశైల దేవస్థానం: స్థానిక శాసనసభ్యులు శిల్పా చక్రపాణిరెడ్డి బుధవారం క్షేత్రంలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు.ఈ పనుల మొత్తం వ్యయం రూ.3.98 కోట్లు. క్షేత్ర అభివృద్ధిలో భాగంగా ఈ పనులు చేసారు .
రైల్వే అతిథిగృహం వద్ద ఆర్.సి.సి. ఓవర్హెడ్ వాటర్యైంకు, కొత్తపేటలో ఫేస్ -1 , ఫేస్ -2 లలో మొత్తం 12 చోట్ల సి.సి. రోడ్లు, ముదిరాజ్ సత్రము నుంచి మల్లికార్జున అన్నదానం జంక్షన్ వరకు సి.సి. రోడ్డు, నందికేశ సదన్ వద్ద నిర్మించిన ఆర్.సి.సి. ఓవర్ హెడ్ వాటర్ ట్యాంకు, గంగా గౌరిసదన్ భవనాలకు నిర్మించిన జనరేటర్ రూము , 380 కె.వి. డీజిల్ జనరేటర్లను శాసనసభ్యులు ప్రారంభించారు.
ఈ ప్రారంభోత్సవ కార్యక్రమాలలో సహాయ కమిషనర్ హెచ్.జి. వెంకటేష్, ఎగ్జిక్యూటీవ్ ఇంజనీర్లు వి.రామకృష్ణ, జి. మురళీధర్రెడ్డి, డిప్యూటీ ఎగ్జిక్యూటీవ్ ఇంజనీరు ( ఐ /సి) పి.వి. సుబ్బారెడ్డి, సంబంధిత అసిస్టెంట్ ఇంజనీర్లు, పలువురు సిబ్బంది పాల్గొన్నారు.