శ్రీశైల దేవస్థానం:రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, దేవదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ సోమవారం శ్రీశైల క్షేత్రానికి విచ్చేసి శ్రీస్వామిఅమ్మవార్లను దర్శించుకున్నారు. వెంట దేవదాయశాఖ ముఖ్యకార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ ,దేవదాయ శాఖ కమిషనర్ ఎం. హరిజవహర్ లాల్ కూడా ఉన్నారు.ఆలయం వద్ద మంత్రికి ఆలయ సంప్రదాయాన్ని అనుసరించి దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఎస్.లవన్న, అర్చక స్వాములు, వేద పండితులు ,మేళతాళాలతో ఘనంగా పూర్ణ కుంభ స్వాగతం పలికారు.అనంతరం శ్రీస్వామివార్లను దర్శించుకున్నారు. ఆ తరువాత ప్రతీ సోమవారం నిర్వహిస్తున్న సహస్ర దీపాలంకరణ సేవలో పాల్గొన్నారు. అనంతరం వెండిరథోత్సవ సేవలో పాల్గొన్నారు.
ఆలయ ప్రాంగణములో (నాగులకట్ట వెనుక భాగాన) సౌండ్ అండ్ లైట్ షోను తిలకించారు. శ్రీశైల సలపురాణం, శ్రీస్వామి అమ్మవార్ల ఆవిర్భావం, శ్రీశైలక్షేత్ర చరిత్ర క్షేత్ర మహిమా విశేషాలను తెలియజేసే ఈ సౌండ్ అండ్ లైట్ షో, ప్రసాద్ (PRASAD-Pilgrimage Rejuvenation And Spiritual Augmentation Drive) పథకం క్రింద రూపొందించారు.
క్షేత్రాభివృద్ధి పనులను పరిశీలించిన ఉపముఖ్యమంత్రి:
రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ క్షేత్రంలోని పలు అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించారు.
వెంట దేవదాయశాఖ ముఖ్యకార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ , దేవదాయశాఖ కమిషనర్ ఎం. హరిజవహర్ లాల్ కూడా ఉన్నారు.భక్తుల వసతి కోసం దేవస్థానం నిర్మిస్తున్న 224 గదుల సముదాయం , శ్రీలలితాంబికా వాణిజ్య సముదాయం, ఆలయ పుష్కరిణి మొదలైన వాటిని పరిశీలించారు. టూరిస్ట్ బస్టాండ్ సమీపంలో భక్తుల వసతి కోసం 224 గదుల సముదాయముగా గణేశ సదనముగా నిర్మిస్తున్నారు.
మొత్తం 224 గదులతో నాలుగు బ్లాకులుగా నిర్మిస్తున్న ఈ సముదాయంలో ఎ బ్లాక్ లో 36 గదులు, 8 షూట్లు, బి బ్లాకులో 64 గదులు, సి బ్లాకులో 48 గదులు, డి బ్లాకులో 64 గదులు నిర్మించారు. ఉపముఖ్యమంత్రి మాట్లాడుతూ మిగిలిని పనులు మొదలైనవాటన్నింటిని రెండు మాసాలలో , సెప్టెంబరు చివరినాటికి పూర్తి చేయాలని అదేశించారు.
తరువాత శ్రీలలితాంబికా వాణిజ్య సముదాయాన్ని పరిశీలించారు. ఆలయ పుష్కరిణి వద్ద జరుగుతున్న నీరాజన మండప నిర్మాణ పనులను పరిశీలించారు. పుష్కరిణిలోని నీరు ఎప్పటికప్పుడు శుభ్రమయ్యే విధంగా వాటర్ ప్యూర్ ఫెయిడ్ ప్లాంటును ఏర్పాటు చేయాలన్నారు.ఈ ఏర్పాటు వలన పుష్కరిణీలోని నీరు శుభ్రంగా ఉంటాయన్నారు.
పరిశీలనలో ధర్మకర్తల మండలి చైర్మెన్ రెడ్డివారి చక్రపాణిరెడ్డి, కార్యనిర్వహణాధికారి ఎస్.లవన్న, ఎగ్జిక్యూటీవ్ ఇంజనీర్లు వి. రామకృష్ణ, భాస్కర్, డిప్యూటీ ఎగ్జిక్యూటీవ్ ఇంజనీరు నరసింహారెడ్డి, ప్రజాసంబంధాల అధికారి టి. శ్రీనివాసరావు, ముఖ్యభద్రత అధికారి నరసింహారెడ్డి తదితరులు ఉన్నారు.