శ్రీశైల దేవస్థానం:
లింగోద్భవకాల మహారుద్రాభిషేకం:
మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ రోజు రాత్రి గం.10.00ల నుండి శ్రీస్వామివారికి లింగోద్భవకాల మహారుద్రాభిషేకం, ప్రత్యేకం. నిష్ణాతులైన 11 మంది అర్చక స్వాములు, వేదపండితులు మహాన్యాసపూర్వకంగా రుద్ర మంత్రాలను పఠిస్తుండగా, దాదాపు 4 గంటలకు పైగా జ్యోతిర్లింగ స్వరూపుడైన శ్రీస్వామివారికి అభిషేకం స్పెషల్.
ఆలయ ప్రాంగణంలోని పవిత్రమైన మల్లికాగుండంలోని జలంతోను, పంచామృతాలతోనూ, పలు ఫలోదకాలతోనూ ఈ అభిషేకం.
పాగాలంకరణ:
లింగోద్భవకాల మహారుద్రాభిషేకం ప్రారంభమైన వెంటనే పాగాలంకరణ . బ్రహ్మోత్సవాలలోఈ పాగాలంకరణకు ఎంతో ప్రత్యేకత ఉంది. మన వివాహాలలో పెండ్లి కుమారునికి తలపాగ చుట్టడం ఒక సంప్రదాయం. ఈ ఆచారమే శ్రీశైల ఆలయంలో పాగాలంకరణ పేరతో ఆనవాయితీగా కొనసాగుతోంది. ఈ పాగా స్వామివారి గర్భాలయ విమాన శిఖరం నుండి ముఖమండపంపై ఉండే నందులను అనుసంధానం చేస్తూ అలంకరించడం ప్రత్యేకం. పాగాలను సమర్పించే భక్తులు నియమంతో భక్తిని మేళవించి సంవత్సరంలో 365 మూరల పొడవుతో ఈ పాగాను నేస్తారు. ఈ పాగాలను దిగంబరుడై అలంకరించడం ప్రత్యేకం. దిగంబరుడై పాగాను అలంకరించవలసి ఉన్నందున పాగాలంకరణ సమయంలో ఆలయంలో విద్యుత్ సరఫరాను నిలిపి వేసారు. చిమ్మచీకటిలో పాగాలంకరణ చేయడం ఎంతో నేర్పుతో కూడుకొన్న పని. యథావిధిగా రాత్రి గం.10.00ల నుండి ప్రకాశం జిల్లా, చీరాల మండలం, హస్తినాపుర గ్రామానికి చెందిన పృథ్వీ వెంకటేశ్వర్లు తనయుడు పృథ్వీ సుబ్బారావు స్వయంగా తెచ్చిన పాగాతో పాటు ఇతర భక్తులు సమర్పించిన పాగాలను కూడా స్వామివారికి అలంకరించారు.
*ఓం నమ:శ్శివాయ🙏
DATE: 15-02-2026
TIME: (02:30 AM TO 12:00 (PM) TEMPLE PILGRIMS COUNTING = 95,207
KIALASA DWARAM PILGRIMS COUNTING =3,973
ANNADHNAM PEOPLE COUNTING =16,472
TOTAL
COMPARTMENT STATUS =14
FREE COMPARTMENT=13
200 COMPARTMENTS = 01
500 COMPARTMENT (ALANKARAM) =0
FREE COMPARTMENTS PRASADAM =
DARSHANAM= curd rice
ALANKARA DARSHANAM
