సేంద్రీయ సాగుతో వ్యవసాయం కొత్తపుంతలు తొక్కాలి

*టీ శాట్ ఛానల్ లో
సేంద్రీయ వ్యవసాయం మీద జరిగిన చర్చ, రైతుల సందేహాలకు సమాధానాల ప్రత్యక్ష్య ప్రసారంలో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు,  పాల్గొన్న అగ్రోస్ ఎండీ రాములు గారు, వ్యవసాయ శాస్త్రవేత్తలు డాక్టర్ అనిత గారు, డాక్టర్ రామాంజనేయులు *

సేంద్రీయ సాగుతో వ్యవసాయం కొత్తపుంతలు తొక్కాలి,

– శుద్దమైన ఆహారం అందించడానికి ప్రపంచ ఆలోచనా విధానం మారాలి,

– సేంద్రియ పంటల మీద ప్రజల ఆసక్తి పెరిగింది,

– సాధారణ పంటలకన్నా సేంద్రీయ పంటలకు అధికధర చెల్లించి కొంటున్నారు

– సేంద్రీయ సాగు మీద మరింత చర్చ జరగాలి,

– రైతుకు అధిక దిగుబడి రావడంతో పాటు ప్రజలకు నాణ్యమైన ఆహారం అందాలి,

– కరోనా వైరస్ ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తోంది ,

– రోగనిరోధక శక్తి కాలానుగుణంగా మనుషులలో తగ్గడం మూలంగానే వ్యాధుల బారిన పడుతున్నాం,

– ప్రపంచవ్యాప్తంగా వైద్య నిపుణులు ఇదే చెబుతున్నారు,

– గాలి, సూర్యరశ్మి, తినే ఆహారం నుండే మనుషులలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది,

– పట్టణీకరణ మూలంగా సూర్యరశ్మి, గాలి పట్టణవాసులకు సరిగ్గా అందడం లేదు,

– పట్టణ వాసులతో పాటు గ్రామీణులకు నాణ్యమైన ఆహారం అందడం లేదు,

– కల్తీలేని ఆహారం మూలంగానే మన పూర్వీకులు, పెద్దలు రోగాల బారిన పడకుండా ఎక్కువకాలం జీవించగలిగారు, జీవించగలుగుతున్నారు,

– పంటలసాగులో రసాయనాలు, ఎరువుల వాడకం పెరగడం మూలంగానే నాణ్యమైన ఆహారం లభించడం లేదు,

– అధిక ఎరువుల మూలంగా భూమి సారం కోల్పోయి కలుషితమయింది,

– ఆకులు, పెంట, చెరువులలోని ఒండును పొలాలలో వేయడం మూలంగా భూమి సారం పెరుగుతుంది,

– రసాయనాలు, ఎరువులతో భూమి నిస్సారమైంది ,

– ప్రస్తుతం దూరదృష్టితో ఆలోచించి నూతన సాగు పద్దతులవైపు నడవాల్సిన అవసరం ఉంది,

– కేసీఆర్ , నాయకత్వంలో వ్యవసాయ రంగంలో నూతన విధానాల మీద తెలంగాణ ప్రభుత్వం దృష్టి సారించింది,

– వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యత ఇచ్చి రైతుబంధు, రైతుభీమా, ఉచిత కరంటుతో పాటు ప్రభుత్వమే కొనుగోళ్లు చేపట్టడం మూలంగా రైతులలో ఆత్మవిశ్వాసం పెరిగింది,

– పల్లెప్రగతి కింద గ్రామపంచాయతీలలో వర్మీ కంపోస్ట్ ఎరువు తయారీకి ప్రోత్సహిస్తున్నాం,

– వరిమళ్లను తగులబెట్టడం ద్వారా మన భూమిని మనమే నాశనం చేసుకుంటున్నాం,

– జొన్న, మొక్క వంటి పంటల వ్యర్థాలను ఎరువులుగా మలిచే అవకాశాలను విస్మరిస్తున్నాం,

– సేంద్రీయ సాగు వైపు రైతులను ప్రోత్సహించాలి,

– దానిమూలంగా మరింత మంది రైతులు ఆ దిశగా పయనిస్తున్నారు,

– సాగుకు ప్రోత్సాహం మూలంగా తెలంగాణలో పంటల దిగుబడి పెరిగింది,

– పండిన పంటలను దాచుకోవడానికి గోదాములు సరిపోవడం లేదు,

– అందుకే కేసీఆర్  మరిన్ని గోదాంల నిర్మాణానికి ప్రణాళిక సిద్దం చేసి నిర్మాణానికి ఆదేశించారు,

– ఒక్క హైదరాబాద్ లోనే ప్రతిరోజూ 6600 టన్నుల వ్యర్థాలు వస్తున్నాయి,

– దానిని సిరి కంపోస్ట్ ఎరువుగా మార్చి రైతులకు అందించే ప్రయత్నం చేస్తున్నాం,

– అవకాశం ఉన్న ప్రతి రైతు సహజ ఎరువుల వినియోగానికి ప్రయత్నం చేయాలి,

– పచ్చిరొట్ట, జీలుగ, పిల్లిపెసర వంటి వాటిని వినియోగించాలి .. గత ఏడాది 16 లక్షల ఎకరాలకు వీటిని సబ్సిడీ కింద  అందించాము,

– ఎరువుల కోసం వేల కోట్లు ప్రభుత్వం సబ్సిడీ భరిస్తుంది .. సహజ ఎరువులతో వాటి వినియోగాన్ని తగ్గించాలి.

print

By Online News Diary

ONLINENEWSDIARY.COM - A Multilingual Online News Portal

Leave a Reply

Your email address will not be published.