
శ్రీశైల దేవస్థానం: శ్రీశైల మహాక్షేత్రములో ఈ నెల 22 నుండి అక్టోబరు 2వ తేదీ వరకు దసరా మహోత్సవాలు ఘనంగా నిర్వహించనునట్లు ఈ ఓ ఎం. శ్రీనివాస రావు తెలిపారు. దసరా మహోత్సవాల నిర్వహణకు సంబంధించి శనివారం సాయంకాలం పరిపాలనా కార్యాలయంలోని సమావేశ మందిరంలో, ఈ ఓ మీడియాతో మాట్లాడారు. వివరాలు ఇవి.
.ఉత్సవ రోజులలో శ్రీస్వామి అమ్మవార్లకు ఆయా కైంకర్యాలన్ని పరిపూర్ణంగా జరిపించేలా చర్యలు
తీసుకుంటున్నారు.
వైదిక కార్యక్రమాల నిర్వహణలో సమయ పాలన ఖచ్చితంగా పాటించేలా చర్యలు తీసుకుంటున్నారు.
ఉత్సవాల సందర్భంగా ప్రతిరోజు శ్రీస్వామివారికి విశేష అర్చనలు, అమ్మవారికి ప్రత్యేకపూజలు,
రుద్రయాగం, చండీయాగం, అమ్మవారి ఉత్సవ మూర్తికి నవదుర్గ అలంకరణలు, స్వామిఅమ్మవార్లకు
వివిధ వాహన సేవలనిర్వహణ.
సెప్టెంబరు 22 తేదీన ఉదయం 9.00గంటలకు అమ్మవారి ఆలయ యాగశాల ప్రవేశముతో
ఉత్సవాలు ప్రారంభమవుతాయి.
ప్రారంభ పూజలలో వేదస్వస్తి, ఉత్సవ సంకల్పం, గణపతి పూజ, పుణ్యాహవచనం, కంకణపూజ,
దీక్షాసంకల్పం, ఋత్విగ్వరణం, అఖండదీపస్థాపన, వాస్తుపూజ, మండపారాధన,చండీ కలశ స్థాపనలు
జరిపించబడుతాయి.
తరువాత 9.30 గంటల నుండి స్వామివారి ఆలయములో యాగశాల ప్రవేశము, చతుర్వేద
పారాయణలు, శివసంకల్పం, గణపతిపూజ అఖండ దీపస్థాపన, వాస్తుపూజ, శ్రీదేవికలశస్థాపన,
జరిపించబడుతాయి.
ఉత్సవాలలో రుద్రపారాయణ, చండీపారాయణ, అమ్మవారికి శ్రీచక్రార్చన, విశేష కుంకుమార్చనలు,
సువాసినీపూజ, కాళరాత్రిపూజ వుంటాయి.
లోక కల్యాణం కోసం ఉత్సవాలలో ప్రతీరోజు జపాలు, పారాయణలు చేస్తారు.
దసరా సందర్భంగా అక్టోబరు 1వ తేదీ, మహర్నవమిరోజున రాష్ట్రప్రభుత్వం వారిచే
శ్రీస్వామిఅమ్మవార్లకు పట్టువస్త్రాలు సమరపిస్తారు.
అక్టోబరు 2 తేదీన ఉదయం యాగ పూర్ణాహుతి, కలశోద్వాసన, అవబృథం తదితర కార్యక్రమాలు
వుంటాయి.
అక్టోబరు 2 వతేది విజయదశమి సందర్భంగా సాయంకాలం తెప్పోత్సవంతో ఉత్సవాలు
ముగియనున్నాయి.
ఆర్జిత సేవలలో ఉత్సవాలందు ప్రతీరోజు స్వామివారి అభిషేకం, అమ్మవారి కుంకుమార్చన,
కల్యాణోత్సవం యథావిధిగా వుంటాయి.
అయితే ఉత్సవాలలో ఆర్జితసేవలలో గతములో మాదిరిగా గణపతిహోమం, చండీహోమం,
రుద్రహోమం, మృత్యుంజయ హోమం, లక్ష కుంకుమార్చన, నవావరణపూజ, సువర్ణపుష్పార్చన,
ఉదయాస్తమానసేవ, ప్రదోషకాలసేవ నిలుపుదల.
భక్తులు ఆయా ఉత్సవ విశేషాలను వీక్షించేందుకు వీలుగా గంగాధర మండపం వద్ద ఎల్.ఈ.డి
స్క్రీను ఏర్పాటు.
శ్రీస్వామిఅమ్మవార్ల గ్రామోత్సవంలో జానపద కళారూపాల ప్రదర్శన,
అదేవిధంగా క్యూకాంప్లెక్స్‌లోని భక్తులకు నిరంతరం మంచినీరు, అల్పాహారాల ఏర్పాటు,
ఉత్సవాలలో ఆయా ఉత్సవాల విశేషాలు తెలిసేవిధంగా తగు బోర్డులను ఏర్పాటు,
భక్తులకు, స్థానికులకు వైద్య సేవలు అందించే వీలుగా దేవస్థానం వైద్యశాలలో అవసరమైన మేరకు
ఔషధాలను సిద్ధంగా ఉంచేలా ఏర్పాట్లు,
• ఉత్సవాలలో ఆలయప్రాంగణము, ఆలయ పరిసరాలతో పాటు శివ వీధులలో (మాడవీధులలో) కూడా
ఉత్సవ వాతావరణం ప్రతిబింబించే విధంగా ఆలయ ప్రాకార కుడ్యానికి కూడా విద్యుద్దీపాలంకరణ
ఏర్పాటు.
ఉత్సవాల సందర్భంగా సంప్రదాయ పద్ధతిలో తగిన విధంగా ప్రత్యేకంగా పుష్పాలంకరణ ఏర్పాటు,
ఉత్సవాలను పురస్కరించుకుని ప్రతీరోజూ నిత్య కళావేదికపై సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహణ.
ఉత్సవాలలో విశేష అలంకారములు- వాహనసేవలు
తేదీ ————వారం————–శ్రీ అమ్మవారి అలంకారం——–శ్రీస్వామిఅమ్మవార్లకు సేవలు
22.09.2025 : పాడ్యమి – సోమవారం: శైలపుత్రి :—————— భృంగీవాహనసేవ
23.09.2025: :విదియ,మంగళవారం :బ్రహ్మచారిణి————–మయూరవాహన సేవ
24.09.2025 :తదియ – బుధవారం: చంద్రఘంట—————రావణవాహనసేవ
25.09.2025 :చవితి గురువారం : కూష్మాండదుర్గ——-వాహన సేవ
26.09.2025 -శుక్రవారం : స్కందమాత———–శేషవాహనసేవ
27.09.2025: పంచమి – శనివారం: కాత్యాయని: హంస వాహనసేవ, పుష్పపల్లకీ సేవ
28.09.2025 -ఆదివారం :————కాళరాత్రి:———-గజవాహన సేవ
29.09.2025 – సోమవారం ——–మహాగౌరి———-నందివాహనసేవ
30.09.2025– అష్టమి ,మంగళవారం——సిద్ధిదాయిని—కైలాస వాహనసేవ
01.10.2025 —-నవమి- బుధవారం——-రమావాణీ సేవిత రాజరాజేశ్వరి అలంకారం–అశ్వవాహనసేవ
02.10.2025–దశమి:(దసరా) – గురువారం—-శ్రీభ్రమరాంబాదేవి—వాహనసేవ-(ఆలయ ఉత్సవము),శమీపూజ,
తెప్పోత్సవం
శ్రీస్వామిఅమ్మవార్లకు అలంకారం
భృంగీవాహనసేవ
మయూరవాహన సేవ
రావణవాహనసేవ
కైలాసవాహన సేవ
శేషవాహనసేవ
హంసవాహనసేవ, పుష్పపల్లకీ సేవ
గజవాహన సేవ
తిథి – వారం
శ్రీ అమ్మవారి అలంకారం
22.09.2025 పాడ్యమి – సోమవారం
శైలపుత్రి
23.09.2025
–
బ్రహ్మచారిణి
24.09.2025 తదియ – బుధవారం
చంద్రఘంట
25.09.2025 చవితి గురువారం
కూష్మాండదుర్గ
26.09.2025 –
స్కందమాత
27.09.2025 పంచమి – శనివారం
కాత్యాయని
28.09.2025 2 –
కాళరాత్రి
29.09.2025 2 – O
మహాగౌరి
30.09.2025 అష్టమి మంగళవారం
సిద్ధిదాయిని
కైలాస వాహనసేవ
01.10.2025 నవమి- బుధవారం
రమావాణీ సేవిత
అశ్వవాహనసేవ
రాజరాజేశ్వరి అలంకారం
02.10.2025
దశమి – గురువారం
శ్రీభ్రమరాంబాదేవి
నందివాహనసేవ
(దసరా)
(ఆలయ ఉత్సవము)
శమీపూజ
తెప్పోత్సవం
నందివాహనసేవ