
శ్రీశైల దేవస్థానం:శ్రీశైల మహాక్షేత్రంలో మార్చి 1 నుండి 11 వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల నిర్వహణకు పలు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. బ్రహ్మోత్సావాలలో భక్తుల రద్దీ కారణంగా భక్తులందరికి కూడా 01.03.2024 నుండి 11.03.2024 వరకు శ్రీ స్వామి వారి అలంకార దర్శనం మాత్రమే కల్పిస్తారు.
- భక్తులకు ఉచిత దర్శనంతో పాటు, శీఘ్ర దర్శనం, అతి శీఘ్ర దర్శనాలకు కూడా అవకాశం వుంది.
- శీఘ్ర దర్శనానికి రూ.200/- అతి శీఘ్రదర్శనానికి రూ.500లను రుసుముగా చెల్లించాల్సి ఉంటుంది. ఈ టిక్కెట్లను ఆన్లైన్ విధానంలో www.srisailadevasthanam.org ద్వారా ముందస్తుగా పొందవచ్చు. ఈ టిక్కెట్లను అప్పటికప్పుడు కరెంట్ బుకింగ్ ద్వారా పొందే అవకాశం కూడా ఉంది.
బ్రహ్మోత్సవాల ప్రారంభంలో అయిదు రోజుల పాటు 01.03.2024 నుండి 05.03.2024 వరకు జ్యోతిర్ముడి (ఇరుముడి) కలిగి వున్న శివదీక్షా భక్తులకు విడతల వారిగా నిర్దిష్టవేళలో మాత్రమే భక్తులకు స్వామివార్ల ఉచిత స్పర్శదర్శనం కల్పిస్తారు.
05.03.2024 రాత్రి గం.7:30 నుంచి 11.03.2024 రాత్రి వరకు భక్తులందరికీ కూడా శ్రీస్వామివారి అలంకార దర్శనానికి మాత్రమే వీలు వీలుంది.
ఈ బ్రహ్మోత్సవాల సందర్భంగా 01.03.2024 నుంచి 11.03.2024 వరకు అన్ని ఆర్జిత సేవలు పూర్తిగా నిలుపుదల చేసారు .
- భక్తులందరూ కూడా దర్శన ఏర్పాట్లను గమనించవలసినదిగా దేవస్థానం కోరింది.