
ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అంత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దళితబంధు కార్యక్రమాన్ని హుజురాబాద్ వేదికగా ప్రారంభించారు. దళిత బంధు పథకం ప్రారంభోత్సవ కార్యక్రమంలో మాట్లాడిన ముఖ్యమంత్రి కేసీఆర్. ఈ సందర్భంగా తొలివిడతగా 15 దళిత కుటుంబాలను గుర్తించి వారికి ముఖ్యమంత్రి చేతుల మీదుగా పది లక్షల రూపాయల చెక్కులను అందజేశారు.