
శ్రీశైల దేవస్థానం:శ్రీశైల దేవస్థానం నిర్వహిస్తున్న ధర్మపథంలో భాగంగా (నిత్య కళారాధన కార్యక్రమంలో భాగంగా) ఈరోజు (01.01.2022) మల్లాది అనూష, నెల్లూరు బృందం భక్తిరంజని కార్యక్రమం సమర్పించింది.
ఆలయ దక్షిణ మాడవీధిలోని నిత్యకళారాధన వద్ద ఈ రోజు సాయంకాలం గం.6:00 ని||ల నుండి భక్తిరంజని కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమం లో ఆనందనర్తన, సుధామయి, సుబ్రహ్మణ్య, విజయాంబికే, శివుడు తాండవం, రంజని నిరంజని. శివాష్టకం. సకలమంత్రముల, లాలి కామాక్షి, మంగళం తదితర గీతాలను ఆలపించారు.
ఈ కార్యక్రమానికి వయోలిన్ సహకారం ఆర్.సుబ్రహ్మణ్యం, కీ బోర్డు సహకారం శ్రీ సురభి సంగీత సౌరభ్ మరియు మృదంగం సహకారం ఆర్.మురళి ఈశ్వర్ అందించారు.
రెండవ కార్యక్రమం గా సాయి శివడ్యాన్స్ అండ్ మ్యూజిక్ అకాడమీ, హైదరాబాద్ వారిచే సంప్రదాయనృత్య ప్రదర్శన కార్యక్రమం జరిగింది.
ఈ కార్యక్రమములో వినాయకౌత్వం, శివతాండవం, శివస్తుతి, అయిగిరినందిని, ఓం నమఃశివాయ తదితర గీతాలకు నిఖత భవాని, ప్రియాంక,సాద్విక, అంజలిప్రియ, భవ్య, లిక్షిత, లక్ష్మీప్రియ, తనిష్,నిహాల్, సర్వజ్ఞ, షణ్ముఖి, అన్వి, సముద్ర, గీతిక, స్పందన,శ్రీమయి. విజయశారద, కిరణ్మయి, పావని మహి, శరణ్య తదితరులు నృత్య ప్రదర్శనను సమర్పించారు.
రేపటి నిత్య కళారాధన
రేపు (02.01.2022) శ్రీమతి జె. మాధురి, నంద్యాల వారిచే భక్తి రంజని కార్యక్రమం మరియు ప్రగతి నృత్య కళానికేతన్, అనంతపురం వారి బృందంచే సంప్రదాయ నృత్య ప్రదర్శన కార్యక్రమం ఏర్పాటు చేసారు.