శ్రీశైల దేవస్థానం:కార్తీక మాసోత్సవాల సందర్భంగా పలు ధార్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు
చేసారు.బుధవారం భారత ప్రభుత్వ స్కాలర్షిప్ హోల్డర్ మద్రాసు కి చెందిన శ్రీమతి గురు గీతా గణేషన్ బృందం, మద్రాసు సంప్రదాయ నృత్యప్రదర్శన సమర్పించారు.
ఈ కార్యక్రమమలో గీతాగణేశ్, నవ్యశ్రావణి, పి. గాయత్రి, నిత్య ప్రసన్న, బి. ధృతిక, జి.శ్రావణి, బి. షణ్ముఖ, పి. తన్వీ, లక్ష్మీకుమారి తదితరులు నృత్య ప్రదర్శన చేసారు.
అనంతరం దేవస్థానం తరుపున ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా రాష్ట్రపతి అవార్డు గ్రహీత డా. జయప్రద రామమూర్తి , బృందం, హైద్రాబాద్ వేణుగానం చేసారు.ఈ కార్యక్రమానికి చక్రపాణి, తిరుపతి వాయులీనం సహకారాన్ని, అరవింద్, చెన్నె మృదంగ సహకారాన్ని, మల్లికార్జున, హైద్రాబాద్ ఘటం వాయిద్య సహకారాన్ని, చంద్రశేఖర్, హైదరాబాద్ సహ వేణువును అందించారు.