
శ్రీశైల దేవస్థానం: ధర్మపథంలో భాగంగా (నిత్య కళారాధన కార్యక్రమం) గురువారం వనపర్తి నరసింహారావు, పోరుమామిళ్ళ వారి బృందం ‘ రామరావణ యుద్ధం’ పై తోలుబొమ్మలాట కార్యక్రమం సమర్పించింది.ఆలయ దక్షిణ మాడవీధిలోని నిత్యకళారాధన వద్ద సాయంకాలం నుండి ఈ తోలుబొమ్మలాట కార్యక్రమం జరిగింది. కథకులుగా వనపర్తి నరసింహారావు వ్యవహరించగా, గాత్రాన్ని వి.పెద్దమునిరావు,ఆర్. ఎంకోజీరావు, వి. కొండమ్మ, వి. నారాయణమ్మ తదితరులు అందించారు.
14 న నిత్య కళారాధన:
14 న పి.వి.ఎ. ప్రసాద్ బృందం గాత్ర కచ్చెరి కార్యక్రమం వుంటుంది.
*Kumara Swamy Puuja, Datthathreya Swamy puuja performed in the temple. Archaka Swaamulu performed the events.