
శ్రీశైల దేవస్థానం: శ్రీశైల దేవస్థానం ఈ ఓ కే ఎస్.రామరావు ఈ రోజు (01.07.2021) న దేవస్థాన గోసంరక్షణశాలను పరిశీలించారు. అదేవిధంగా గోసంరక్షణశాలలో విభూతి తయారీ కేంద్రాన్ని కూడాపరిశీలించారు.ఈ సందర్భంగా ఈ ఓ మాట్లాడుతూ గోశాలలోని ప్రతిగోవు పై ప్రత్యేక శ్రద్ధ కనబర్చాలని గోశాల విభాగాధికారులను ఆదేశించారు. ఎప్పటికప్పుడు గోవుకు తగినంత మేత, తాగునీరు అందించడం లో ప్రత్యేకశ్రద్ధ కనబర్చాలన్నారు. ఈ గోవులన్నింటికి కూడా శాస్త్రీయ ప్రమాణాలనుగుణంగా పౌష్టికాహారాన్ని అందించాలన్నారు. • అదేవిధంగా గోవులకు సంరక్షణకు అవసరమైన ఔషధాలన్నింటినీ సిద్ధంగా ఉంచుకోవాలన్నారు.
విభూతి తయారీ కేంద్రాన్ని ఈ ఓ పరిశీలించారు. విభూతితయారీలో సంప్రదాయ పద్ధతులను, పూర్తి నాణ్యతను తప్పనిసరిగా పాటించాలన్నారు.కర్ప్యూ సమయాలు సడలించిన కారణంగా ఆలయాన్ని సందర్శించే భక్తుల సంఖ్య పెరుగుతోందని, భక్తుల రద్దీకనుగుణంగా తగినంత విభూతి స్టాకును సిద్ధంగా ఉంచుకోవాలన్నారు.
దేవస్థానం భక్తుల సౌకర్యార్థం గోమయముతో తయారు చేస్తున్న విభూతి, హోమానికి వినియోగించే పిడకలు, గోమయంతో తయారు చేసిన ధూపపు బత్తీలు, గోఅర్క్ మొదలైన గో ఉత్పత్తులను విక్రయిస్తోంది.
ఈ కార్యక్రమం లో గోశాల సహాయ కార్యనిర్వహణాధికారి ఎస్.వి. కృష్ణారెడ్డి, గోశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.