×

జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల కౌంటింగ్ కు ఏర్పాట్లు పూర్తి-కలెక్టర్ పి.కోటేశ్వరరావు

జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల కౌంటింగ్ కు ఏర్పాట్లు పూర్తి-కలెక్టర్ పి.కోటేశ్వరరావు

👉🏻కౌంటింగ్‌ ప్రశాంతంగా జరిపేందుకు అభ్యర్థులు, ఏజెంట్లు సహకరించాలి :-

👉🏻జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వరరావు :-

👉🏻కౌంటింగ్ కేంద్రాల వద్ద పటిష్ట పోలీసు బందోబస్తు :-

👉🏻జిల్లా ఎస్పీ సిహెచ్ సుధీర్ కుమార్ రెడ్డి :-

కర్నూలు, సెప్టెంబర్ 17 :-రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు ఆదివారం జరిగే జెడ్పిటిసి, ఎంపీటీసీ ఎన్నికల కౌంటింగ్‌ ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా నిర్వహిస్తున్నాముని , అభ్యర్థులు, ఏజెంట్లు సహకరించాలని జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వరరావు పాత్రికేయుల సమావేశం ద్వారా విజ్ఞప్తి చేశారు.

శుక్రవారం సాయంత్రం స్థానిక కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల -2021 కౌంటింగ్‌ పై జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వరరావు, జిల్లా ఎస్పి సుధీర్ కుమార్ రెడ్డిలు జాయింట్ ప్రెస్ మీట్ నిర్వహించారు.

మీడియా సమావేశంలో జాయింట్‌ కలెక్టర్‌ (రెవిన్యూ మరియు రైతు భరోసా) రామ సుందర్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) డాక్టర్ మనజీర్ జిలానీ సామూన్, జెడ్పీ సీఈఓ వెంకటసుబ్బయ్య, పాత్రికేయుల సమావేశంలో పాల్గొన్నారు.

జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ అదివారం జరగనున్న జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు సంబంధించి ఏర్పాట్లను పూర్తి చేశామని, ఉదయం ఎనిమిది గంటలకు కౌంటింగ్ ప్రారంభమవుతుందన్నారు. జిల్లాలోని 53 జడ్పిటిసి స్థానాలలో 16 జడ్పిటిసి స్థానాలు ఏకగ్రీవం కాగా, 36 జడ్పిటిసి స్థానాలకు ఎన్నికలు జరిగాయన్నారు. జిల్లాలో 807 ఎంపిటిసి స్థానాలలో 312 ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవం కాగా, 484 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరిగాయన్నారు. ఇందులో పురుషులు 7,75,487 మంది, స్త్రీలు 7,80,236 మంది, ఇతరులు 161, మొత్తం 15,55,884 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 145 జడ్పిటిసి, 1308 ఎంపిటిసిలు పోటీ పడ్డారన్నారు. 1785 పోలింగ్ స్టేషన్లు, 16 కౌంటింగ్ సెంటర్స్, 154 కౌంటింగ్ హాల్స్ లో ఆదివారం ఉదయం ఎనిమిది గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం అవుతుంది అన్నారు. ఓట్ల లెక్కింపు కోసం 44 మంది రిటర్నింగ్ ఆఫీసర్, 44 మంది అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ లు (జెడ్ పి టి సి), 88 మంది అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ (ఎంపీటీసీ), 14 కౌంటింగ్ ఇంచార్జ్ ఆఫీసర్స్, 2137 కౌంటింగ్ సూపర్వైజర్, కౌంటింగ్ అసిస్టెంట్ 4274 మంది సిబ్బంది పాల్గొంటున్నట్లు జిల్లా కలెక్టర్‌ తెలిపారు. ఎన్నికల కౌంటింగ్‌ ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా నిర్వహిస్తామని, అభ్యర్థులు, ఏజెంట్లు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. లెక్కింపు ప్ర‌క్రియ‌లో పాల్గొనే ఏజెంట్ల‌కు కోవిడ్ ప‌రీక్ష త‌ప్ప‌నిస‌రి అని స్ప‌ష్టం చేశారు. లేదా వేక్సినేష‌న్ రెండు డోసులు పూర్త‌యి ఉండాల‌న్నారు. కోవిడ్‌ నెగిటివ్ రిపోర్టు లేదా వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ స‌మ‌ర్పించిన వారిని మాత్ర‌మే లోప‌లికి అనుమతించడం జరుగుతుందన్నారు. అందువ‌ల్ల కౌంటింగ్ ఏజెంట్లు రేపటి రోజు ప్రతి మండలంలోని పీహెచ్సీలో త‌క్ష‌ణ‌మే ర్యాపిడ్ యాంటీజన్ ప‌రీక్ష చేయించుకోవాలన్నారు. మాస్కు ధరించి కోవిడ్ నియమ నిబంధనలు తప్పక పాటించాలని జిల్లా కలెక్టర్ సూచించారు. గెలుపొందిన తర్వాత సర్టిఫికెట్ తీసుకోవడానికి కూడా ఒకరు లేక ఇద్దరు మాత్రమే అనుమతి ఉంటుందన్నారు.

జిల్లా ఎస్పీ సిహెచ్ సుధీర్ కుమార్ రెడ్డి  మాట్లాడుతూ… జెడ్పిటిసి, ఎంపీటీసీ ఎన్నికల లెక్కింపు ప్రశాంతంగా జరిగేందుకు కౌంటింగ్ కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని, కౌంటింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ కూడా అమలులో ఉంటుందన్నారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద షామియానా, మైక్ సెట్ లు, రేపెన్స్ నిషేధమని, ఏజెంట్లు ఖచ్చితంగా గుర్తింపు కార్డులు తీసుకురావాలని, ఐడి కార్డులు తీసుకురాకుంటే లోపలికి అనుమతించం అన్నారు.

ఎన్నికల సిబ్బంది కచ్చితంగా విధులకు హాజరు కావాలి :

కర్నూలు సెప్టెంబర్ 17: జడ్పిటిసి, ఎంపీటీసీ ఎన్నికల కౌంటింగ్ విధులకు నియమించిన అధికారులు, సిబ్బంది కచ్చితంగా విధులకు హాజరుకావాలని జిల్లా కలెక్టర్ పి. కోటేశ్వరరావు ఆదేశించారు

హాజరు కాని వారిపై ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ హెచ్చరించారు

print

Post Comment

You May Have Missed