ఎంఎస్‌ఎమ్‌ఈ పరిశ్రమలకు రాయితీలు విడుదల చేసిన ముఖ్యమంత్రి వైయస్ జగన్
*ఈ రోజు ఉదయం (03-09-2021) న తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుండి రాష్ట్ర ముఖ్యమంత్రి క ఎంఎస్‌ఎమ్‌ఈ లకు రెండో విడత పారిశ్రామిక రాయితీ విడుదల నిధులను పరిశ్రమదారుల బ్యాంకు అకౌంట్ కు నేరుగా జమ చేసారు. కర్నూలు కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా కలెక్టర్ పి కోటేశ్వరరావు , జాయింట్ కలెక్టర్ (ఆసరా మరియు సంక్షేమం) ఎం.కె.వి. శ్రీనివాసులు, జిల్లా పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ సోమశేఖర్ రెడ్డి, డిప్యూటీ డైరెక్టర్ మదన్ మోహన్ శెట్టి, డిక్కీ కోఆర్డినేటర్ రాజ మహేంద్ర నాథ్, దళిత ఇండస్ట్రియల్ అసోసియేషన్ జయన్న, ఐ ఎఎల్ఎ ప్రెసిడెంట్ జి.ఆర్.కె. రెడ్డి, పరిశ్రమదారులు, తదితరులు పాల్గొన్నారు./
👉🏻ప్రభుత్వం విడుదల చేసిన రాయితీలను సద్వినియోగం చేసుకోండి :- కలెక్టర్ పి. కోటేశ్వరరావు
కర్నూలు, సెప్టెంబర్ 03 :-2021 ఆర్థిక సంవత్సరంలో కర్నూలు జిల్లాలోని 589 పరిశ్రమలకు రూ.30.30 కోట్లు, కోవిడ్ -19 లాక్ డౌన్ సమయంలో కనీస విద్యుత్ చార్జీలను, విద్యుత్ శాఖకు చెల్లించవలసిన కనీస చార్జీలను ఏప్రిల్ -2020, మే 2020, జూన్ 2020 బకాయిలను రాయితీ రూపములో 451 పరిశ్రమలకు రూ.3.07 కోట్లు, మొత్తంగా రూ.33.37 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిందని జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వరరావు అన్నారు.
శుక్రవారం ఉదయం తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుండి రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి కరోనా కష్టకాలంలో ఎంఎస్‌ఎమ్‌ఈలకు రెండో విడత పారిశ్రామిక రాయితీ విడుదల నిధులను పరిశ్రమదారుల బ్యాంకు ఖాతాలకు నేరుగా కంప్యూటర్ బటన్ నొక్కి జమ చేశారు..కర్నూలు జిల్లాలో 9126 సూక్ష్మ , చిన్న తరహా పరిశ్రమలు రూ.2171.80 కోట్ల పెట్టుబడులతో మొదలు పెట్టి దాదాపు 5,83,510 మందికి ఉపాధి కల్పించామన్నారు. ఎంఎస్‌ఎమ్‌ఈ పరిశ్రమలకు రాష్ట్ర ప్రభుత్వం రాయితీలు విడుదల చేసిందని ,పారిశ్రామికవేత్తలు ప్రభుత్వం విడుదల చేసిన రాయితీని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
అదృష్టంగా భావిస్తున్నా :-
నా పేరు టి.యామిని దేవి, ఓర్వకల్లు మండలం తిప్పాయపల్లె లో విశ్వక్ ఏఈసి 1.58 కోట్లు పెట్టుబడితో పరిశ్రమను నడుపుతున్నాను. సుమారు నా దగ్గర 30 మంది స్థానికులు పని చేస్తున్నారు. అందరికీ ఉపాధి కల్పిస్తూ ఓవైపు పరిశ్రమను నడుపుతున్నాను. ఇలాంటి తరుణంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి మమ్ములను ఆదుకునేందుకు ముందుకు రావడం చాలా సంతోషంగా ఉంది. 72 లక్షల రూపాయలు నా ఖాతాలోకి జమ అయింది. దీంతో కొంత వెసులుబాటు కల్పించినట్లు ఉంది. జగనన్నకు మా కుటుంబం ఎప్పుడు రుణపడి ఉంటుంది. -టి.యామిని దేవి, ఓర్వకల్లు మండలం, తిప్పాయపల్లె విశ్వక్ ఏఈసి పరిశ్రమ ప్రతినిధి.
రాయితీ విడుదల చేయడం ఆనందం :-
నా పేరు కే.దివ్య రెడ్డి, బిర్లా గేట్ దగ్గర ఆటోమొబైల్స్ సర్వీసెస్ సెంటర్ మరియు టైర్స్ సర్వీసెస్ పరిశ్రమల నిర్వాహకురాలును. 48 వేల లక్షలకు సంబంధించిన పెట్టుబడి ద్విచక్ర వాహనాలు మరియు ఫోర్ వీలర్ సంబంధించి ఆటో మొబైల్ సర్వీస్ చేస్తున్నాము. స్థానికంగా నాతో పాటు 22 మందికి ఉపాధి కల్పిస్తున్నాను. కోవిడ్ తరుణంలో మాపై దయవుంచి ముఖ్యమంత్రి జగనన్న12 లక్షల రూపాయలు రాయితీ విడుదల చేయడం చాలా ఆనందంగా ఉంది. జగనన్న ఇచ్చిన రాయితీని డబ్బులతో నంద్యాల చెక్ పోస్ట్ లో ఇంకో బ్రాంచ్ ఓపెన్ చేసి పది మందికి ఉపాధి కల్పిస్తాను. -కే.దివ్య రెడ్డి, బిర్లా గేట్ ఆటోమొబైల్ సర్వీసెస్ పరిశ్రమల నిర్వాహకురాలు.
పరిశ్రమలకు జీవం పోస్తున్న జగనన్న :-
నా పేరు సి.హెచ్ సురేష్, డోన్ చిన్న మల్కాపురంలో గజలక్ష్మి మినరల్స్ పరిశ్రమను 60 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి 2018 నడుపుతున్నాను. ఇందులో పౌడర్ ను మార్కెటింగ్ చేస్తూ 12 మందికి ఉపాధి కల్పిస్తున్నాను. ప్రతి నెల మూడు లక్షల నుంచి 4 లక్షల రూపాయల వరకు ఆదాయం వస్తుంది. ఈ రోజు జగనన్న గజలక్ష్మి మినరల్స్ పరిశ్రమకు 12 లక్షల రూపాయల రాయితీ విడుదల చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి పరిశ్రమలకు రాయితీలు విడుదల చేస్తూ, ప్రోత్సాహకాలు అందిస్తూ పరిశ్రమలకు జీవం పోస్తున్నారు. -సి.హెచ్ సురేష్, గజలక్ష్మి మినరల్స్ పరిశ్రమ, చిన్న మల్కాపురం డోన్, కర్నూలు జిల్లా.
జగనన్న బడికి వికాసం – జెసిపితో ఉపాధి :-
నా పేరు నయోమి రాణి, డోన్ పట్టణానికి చెందిన నేను జెసిపి వాహనాన్ని 29 లక్షల రూపాయలు పెట్టి కొనుగోలు చేశాను. ప్రతి నెల జెసిబి ఆపరేటర్ తో పాటు డీజిల్ మరియు బ్యాంకు కంతులు, ఇతర వాటికి సంబంధించి పోను 70 వేల రూపాయలు ఆదాయం వస్తుంది. నేను జగనన్న బడుగు వికాసం పథకం కింద అప్లికేషన్ పెట్టుకున్న వెంటనే జిల్లా పరిశ్రమల శాఖ అధికారులు నా దరఖాస్తును పరిశీలించి ఇప్పటికీ 11 లక్షల 80 వేల రూపాయలు సబ్సిడీ విడుదలకు కృషి చేశారు. – నయోమి రాణి జెసిబి నిర్వాహకురాలు, డోన్ పట్టణం, కర్నూలు జిల్లా.
Post Comment