తాడేపల్లి: మహనీయులు డాక్టర్ బీఆర్.అంబేడ్కర్, మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయాలకు అనుగుణంగా సీఎం వైయస్ జగన్ పరిపాలన సాగుతోందని, దేశ చరిత్రలోనే తొలిసారిగా 70 శాతం మంత్రి పదవులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకే కేటాయించి సామాజిక విప్లవానికి నాంది పలికిన ముఖ్యమంత్రి వైయస్ జగన్ చరిత్రలో నిలిచిపోతారని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున అన్నారు. దళిత సంక్షేమాన్ని భుజాన వేసుకున్న ముఖ్యమంత్రిగా, బడుగుల అభివృద్ధి కోసం నిరంతర శ్రామికుడిగా, బలహీన వర్గాలను ఆకట్టుకునేలా, మైనార్టీలకు తోడుగా ఉన్న ముఖ్యమంత్రిగా వైయస్ జగన్ ఉన్నారని చెప్పడానికి చాలా గర్విస్తున్నామన్నారు. తాడేపల్లిలోని వైయస్ఆర్ సీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రి మేరుగు నాగార్జున విలేకరుల సమావేశం నిర్వహించారు.
అధికారం అనేది పవర్ కాదు..బాధ్యత:
అధికారమన్నది పవర్ కాదు..అది ఒక బాధ్యత అని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొనారు. కేబినెట్‌లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు అధిక ప్రాధాన్యత కల్పించాలన్నదే సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్య విధానమని తెలిపారు. పదవులు దక్కలేదన్న నాయకుల అసంతృప్తి కాదని, వారి అనుచరుల తాత్కాలిక అసంతృప్తి మాత్రమేనని చెప్పారు. పార్టీలో ప్రతి ఒక్కరికీ సముచిత స్థానం ఉందని స్పష్టం చేశారు. సోమవారం తాత్కాలిక సచివాలయం వద్ద సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడారు. వెనుకబడిన వర్గాలకు ప్రాధాన్యత కల్పించాలన్నదే పార్టీ సిద్ధాంతం. ఇందులో ఒకరికి న్యాయం, మరొకరికి అన్యాయం అన్నది ఎక్కడా లేదు. అందరూ అర్థం చేసుకున్నారు కాబట్టే పూర్తిగా సాఫీగా సాగుతోంది. అధికారం మా నాయకుడికి రావాలన్నదే అనుచరుల బాధ..అక్కడి నుంచి అసంతృప్తి అంటూ పుకార్లు పుట్టిస్తున్నారు. ఆవేశంతో కొంత మంది రాజీనామాలు అనే మాట వచ్చి ఉంటుంది. పరిమితి సంఖ్యలో ఉన్న పోస్టులో అందరికీ న్యాయం చేయడం కొంత ఇబ్బందికరంగానే ఉంటుంది. ఇదంతా తాత్కాలికమే. నాయకుడి అసంతృప్తి అన్నది అవాస్తమని కొట్టిపారేశారు. పార్టీ బాధ్యతలు, రీజినల్ కో–ఆర్డినేటర్ పోస్టులు కూడా భర్తీ చేయనున్నారు. వాళ్లు కీలకంగా మారుతారు. బీసీలకు పెద్ద పీట వేయడమన్నది కచ్చితంగా గమనించాలి. మంత్రివర్గం, జిల్లా పార్టీ అధ్యక్షులు, రీజినల్ కో–ఆర్డినేటర్లు అందరూ కలిసి ఎన్నికల టీమ్‌గా ఉంటుంది. వచ్చే ఎన్నికల్లో వీరంతా పార్టీని విజయపథంలో నడిపిస్తారని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు.
నూతన మంత్రులకు శాఖలు కేటాయింపు:
తాడేపల్లి: నూతన మంత్రివర్గ సభ్యులకు ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి శాఖలు కేటాయించారు. గతంలో మాదిరిగానే ఐదుగురికి ఉప ముఖ్యమంత్రి పదవులను కేటాయించారు. డిప్యూటీ సీఎంలుగా పీడిక రాజన్నదొర, బూడి ముత్యాలనాయుడు, కొట్టు సత్యనారాయణ, నారాయణస్వామి, అంజాద్ బాషాలను నియమించారు.
మంత్రులకు కేటాయించిన శాఖలు..
పీడిక రాజన్నదొర – డిప్యూటీ సీఎం, గిరిజన సంక్షేమ శాఖ
బూడి ముత్యాలనాయుడు – డిప్యూటీ సీఎం, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి
కొట్టు సత్యనారాయణ – డిప్యూటీ సీఎం, దేవాదాయ శాఖ
కె.నారాయణస్వామి – డిప్యూటీ సీఎం, ఎక్సైజ్ శాఖ
అంజాద్ బాషా – డిప్యూటీ సీఎం, మైనార్టీ సంక్షేమం
ధర్మాన ప్రసాదరావు – రెవెన్యూ, రిజిస్ట్రేషన్స్ అండ్ స్టాంప్స్.
సీదిరి అప్పలరాజు – పశుసంవర్థక, మత్స్యశాఖ
బొత్స సత్యనారాయణ – విద్యా శాఖ
గుడివాడ అమర్‌నాథ్ – పరిశ్రమలు, ఐటీ, పెట్టుబడులు, వాణిజ్య శాఖ
దాడిశెట్టి రాజా – రోడ్లు, భవనాలు శాఖ
పినిపె విశ్వరూప్ – రవాణా శాఖ
చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ – బీసీ సంక్షేమం, సినిమాటోగ్రఫీ, సమాచార శాఖ
తానేటి వనిత – హోంశాఖ, ప్రకృతి విపత్తుల నివారణ
కారుమూరి నాగేశ్వరరావు – పౌర సరఫరాలు, వినియోగదారుల శాఖ
జోగి రమేష్ – గృహ నిర్మాణ శాఖ
మేరుగ నాగార్జున – సాంఘిక సంక్షేమ శాఖ
విడదల రజినీ – వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమం, వైద్య విద్య శాఖ
అంబటి రాంబాబు – జలవనరుల శాఖ
బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి – ఆర్థిక, ప్రణాళిక, వాణిజ్య పన్నులు, శాసనసభ వ్యవహారాలు
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి – విద్యుత్, సైన్స్ అండ్ టెక్నాలజీ, అటవీ, పర్యావరణ
ఆదిమూలపు సురేష్ – మున్సిపల్, అర్బన్ డెవలప్‌మెంట్
ఆర్కే రోజా – టూరిజం, సాంస్కృతిక, యువజన శాఖ
కాకాణి గోవర్థన్‌రెడ్డి – వ్యవసాయం, సహకార, మార్కెటింగ్
గుమ్మనూరు జయరాం – కార్మిక శాఖ
ఉషశ్రీచరణ్ – స్త్రీ, శిశు సంక్షేమం