
శ్రీశైల దేవస్థానం: శ్రీశైల దేవస్థానం ఈ ఓ ఎస్.లవన్న బుధవారం గణేశ సదనం నిర్మాణం పనులను పరిశీలించారు.టూరిస్ట్ బస్టాండ్ సమీపంలో భక్తుల వసతి కోసం 224 గదుల సముదాయం గా గణేశ సదన నిర్మాణం పూర్తి కావచ్చింది.మొత్తం 224 గదులతో నాలుగు బ్లాకులుగా నిర్మిస్తున్న ఈ సముదాయంలో ఎ బ్లాక్ లో 36 గదులు ,8 షూట్లు, బి బ్లాకులో 64 గదులు, సి బ్లాకులో 48 గదులు, డి బ్లాకులో 64 గదులు నిర్మించారు. నిర్మాణంలో మిగిలిన పనులను వెంటనే పూర్తి చేయాలన్నారు ఈ ఓ. గదులలో ఏర్పాటు చేసే ఫర్నీచరు కూడా పూర్తిగా నాణ్యత ప్రమాణాలను కలిగి ఉండాలన్నారు. సముదాయ ప్రాంగణములో నాలుగు వైపులా తలపెట్టిన సీసీరోడ్లు పనులను వెంటనే ప్రారంభించాలన్నారు
వసతి సముదాయ ప్రాంగణానికి సమీపంలోనే వీలైనంత మేరకు పార్కింగ్ ప్రదేశాన్ని కూడా అభివృద్ధి చేయాలని సూచించారు ఈ ఓ.వెంటనే పనులను ప్రారంభించేందుకు చర్యలు చేపట్టాలన్నారు.సముదాయ ప్రాంగణమంతా కూడా పచ్చదనం పెంపొందే విధంగా ల్యాండ్ స్కేపింగ్ పనులు కూడా వెంటనే చేపట్టాలని ఉద్యానవన విభాగాన్ని చేపట్టాలని ఉద్యానవ అధికారిని ఆదేశించారు.సుందరీకరణ పనులలో భాగంగా గణేశ సదన్ ప్రాంగణములో కూడా అనువైన మొక్కలను నాటాలన్నారు.మొక్కలు నాటే కార్యక్రమాన్ని వెంటనే చేపట్టాలని సూచించారు.
ఎగ్జిక్యూటీవ్ ఇంజనీర్లు డి.వి. భాస్కర్, వి. రామకృష్ణ, డిప్యూటీ ఎగ్జిక్యూటీవ్ ఇంజనీరు నరసింహారెడ్డి, అసిస్టెంట్ ఇంజనీర్లు సీతారమేష్, భవన కుమార్ తదితరులు పాల్గొన్నారు.