×

రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం ఎంపీపీ, ఉపాధ్యక్షుల ఎన్నిక సజావుగా, పకడ్బందీగా నిర్వహించాలి

రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం ఎంపీపీ, ఉపాధ్యక్షుల ఎన్నిక సజావుగా, పకడ్బందీగా నిర్వహించాలి

*ప్రిసైడింగ్ ఆఫీసర్స్ , అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్స్ ట్రైనింగ్ ప్రోగ్రాంలో జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వరరావు :-

కర్నూలు, సెప్టెంబర్ 21 :-రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం ఈ నెల 24న అన్ని మండలాలలో ఎంపీపీ, ఉపాధ్యక్షుల ఎన్నిక సజావుగా, పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వరరావు ప్రిసైడింగ్ ఆఫీసర్స్ , అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్స్ లను ఆదేశించారు.

మంగళవారం మధ్యాహ్నం జిల్లా పరిషత్ సభాభవనంలో ఎంపీటీసీ, జెడ్పిటిసి ఎన్నికలు 2021 ప్రిసైడింగ్ ఆఫీసర్స్ , అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్స్ ట్రైనింగ్ ప్రోగ్రాంలో జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వరరావు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

జెడ్పి సిఈఓ వెంకట సుబ్బయ్య, డిప్యూటీ సిఈఓ భాస్కర్ నాయుడు, జిల్లా పరిశ్రమల శాఖ జి.యం సోమశేఖర్ రెడ్డి, ప్రిసైడింగ్ ఆఫీసర్స్ మరియు అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్స్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, తదితరులు పాల్గొన్నారు.

జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వరరావు మాట్లాడుతూ….ఆదివారం ఓట్ల లెక్కింపు విజయవంతంగా నిర్వహించారని, ప్రతి ఒక్కరికీ అభినందనలు తెలిపారు. ఈ నెల 24వ తేదీన ముందుగా మెంబర్ కో ఆప్టెడ్, సభ్యుడిగా పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితా మండల పరిషత్ ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ ల ఎన్నిక ప్రక్రియను ఎన్నికల కమిషన్ నియమ నిబంధనలు పాటించి నిర్వహించాలన్నారు. ఎన్నికల కమిషన్ నిర్దేశించిన టైంలైన్ ప్రకారం ఒక్క నిమిషం ఆలస్యం కాకుండా ఎన్నికల షెడ్యూల్ ప్రకారం ముందుగా మెంబర్ కో ఆప్టెడ్ (కో ఆప్షన్ మెంబర్) ఎన్నిక చేయాలని, అనంతరం మండల పరిషత్ ప్రెసిడెంట్, ఆ తరువాత వైస్ ప్రెసిడెంట్ ల ఎన్నిక ప్రక్రియను చేపట్టాలన్నారు. ఎన్నిక నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లన్నీ పూర్తి చేసుకోవాలన్నారు. ప్రతి అంశం ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలకు లోబడి జరగాలన్నారు. ప్రతి ఒక్కరూ మాస్కూలు ధరించేలా చూడాలని, శానిటైజర్ లు అందుబాటులో ఉండాలన్నారు. ఎంపీపీ, వైస్ ఎంపీపీల ఎన్నిక ప్రక్రియను సజావుగా నిర్వహించి విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. శిక్షణలో తలెత్తిన సందేహాలను నివృత్తి చేసుకోవాలని ప్రిసైడింగ్ ఆఫీసర్స్ మరియు అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్స్ లను జిల్లా కలెక్టర్ సూచించారు.

print

Post Comment

You May Have Missed