
శ్రీశైల దేవస్థానం: శ్రీశైల దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షులు రెడ్డివారి చక్రపాణిరెడ్డి, కార్యనిర్వహణాధికారి ఎస్. లవన్న సోమవారం గణేశసదనము నిర్మాణాన్ని పరిశీలించారు.టూరిస్ట్ బస్టాండ్ సమీపంలో భక్తుల వసతి కోసం 220 గదుల సముదాయముగా గణేశ సదనము నిర్మాణమవుతోంది.
మొత్తం 220 గదులతో నాలుగు బ్లాకులుగా నిర్మిస్తున్న ఈ సముదాయంలో ఎ బ్లాక్ లో 36 గదులు, 8 షూట్లు, బి బ్లాకులో 64 గదులు, సి బ్లాకులో 48 గదులు, డి బ్లాకులో 64 గదులు నిర్మిస్తున్నారు.
ఈ సందర్భంగా ధర్మకర్తలమండలి అధ్యక్షులు, కార్యనిర్వహణాధికారి మాట్లాడుతూ మరో నెలరోజుల లోగా ఫినిషింగ్ పనులన్నింటినీ పూర్తి చేయాలన్నారు.పూర్తి చేయాల్సిన రోజువారీ పనుల ప్రణాళికలను (యాక్షన్ ప్లాన్) రూపొందించుకుని తదనుగుణంగా పనులు పూర్తి చేయాలన్నారు. ఫినిషింగ్ పనులు పూర్తి అయిన వెంటనే ఫర్నీచరు ఏర్పాటు పనులను ప్రారంభించాలని ఆదేశించారు.సముదాయ ప్రాంగణములో నాలుగువైపులా సీసీరోడ్లు, అదేవిధంగా నిర్మాణం చుట్టూ ప్రహరీగోడ నిర్మాణ పనులను కూడా వెంటనే ప్రారంభించాలన్నారు. సివిల్ పనులు పూర్తి అయిన వెంటనే ప్రాంగణమంతా కూడా పచ్చదనం పెంపొందించే విధంగా ల్యాండ్ స్కేపింగ్ పనులను చేపట్టాలన్నారు.వసతి సముదాయ ప్రాంగణానికి సమీపంలోనే వీలైనంత మేరకు పార్కింగ్ ప్రదేశాన్ని అభివృద్ధి చేయాలన్నారు.
ఈ పరిశీలనలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు డి.భాస్కర్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు ఎం. నరసింహారెడ్డి, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు వి. భవన కుమార్, ఎం. ప్రణయ్,ఎడిటర్ డా.సి.అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
*Vendi Rathotsava Seva ,sahasra deeparchana seva performed by the Archaka swaamulu.
* P.V.S. Rama Prasad, Advocate, Atmakur, Nandyal District donated Rs. 1,11,111 for Annadhaanam scheme In The Memory Of Pamulapati Narayanamma.
- E.Ramakrishna Varaprasad group of Kurnool presented Bhakthi Ranjani programme.