హైదరాబాద్, డిసెంబర్ 12 :మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మంగళవారం గృహా నిర్మాణ శాఖ కార్యకలాపాలపై సమీక్ష నిర్వహించారు.
ఈ సమావేశానికి గృహ నిర్మాణశాఖ సెక్రటరీ శ్రీనివాసరాజు , Special Secretary & గృహ నిర్మాణ సంస్థ ఎండి శ్రీమతి Viziendira Boyi , గృహ నిర్మాణ సంస్థ( Housing Corporation), గృహ నిర్మాణ మండలి ( Housing Board) , రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ ఉన్నతాధికారులు హాజరయ్యారు.
మంత్రి మాట్లాడుతూ పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు అందించడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.
త్వరలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గృహ నిర్మాణ శాఖ కార్యకలాపాలపై సమీక్ష నిర్వహించి పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి విధివిధానాలు ఖాయం చేస్తారని తెలిపారు. ఇండ్ల నిర్మాణానికీ మూడు లేదా నాలుగు నమూనాలతో ప్లాన్లు సిద్ధం చేయాల్సిందిగా అధికారులను ఆదేశించారు.
గృహ నిర్మాణ సంస్థ ను పునరుద్ధరణ చేస్తూ ఇందిరమ్మ ఇండ్లు నిర్మించడానికి ఇంకను అవసరమైన సిబ్బందిని ఇతర శాఖల నుంచి డిప్యూటేషన్ పై కూడా తీసుకోనే విధంగా ప్రతిపాదనలు సిద్దం చేయవలసిందిగా సంబంధిత సెక్రటరీ ని ఆదేశించారు.ఈ బృహత్ కార్యక్రమానికి అవసరమైన నిధుల సమీకరణ కోసం తగిన చర్యలు తీసుకోవాలని, అందుకు తగినట్లుగా ప్రతిపాదనలు సిద్ధం చేయాల్సిందిగా ఆదేశించారు.టెండర్లు ఖరారు చేసి నిర్మాణం చేపట్టిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పూర్తి కి నిధుల వివరాలు సమర్పించాలని ఆదేశించారు.రాజీవ్ స్వగృహ ద్వారా అభివృద్ధి చేసిన ఆస్తుల గురించి మంత్రి ఆరా తీశారు. విక్రయించని ఆస్తులను తగిన ధరలతో మార్కెట్ చేయడానికి , విక్రయించడానికి వృత్తిపరమైన (expert) బృందాలను నియమించాలని ఆదేశించారు. సెమీఫినిష్డ్ టౌన్‌షిప్‌లను సరైన ధరలకు, కేబినెట్‌లో చర్చించి విక్రయించేందుకు తగిన నిర్ణయం తీసుకోనున్నారు.