×

శ్రీశైల క్షేత్రాన్ని మరింతగా  తీర్చిదిద్దేందుకు త్రిముఖ వ్యూహం-ఈ ఓ లవన్న

శ్రీశైల క్షేత్రాన్ని మరింతగా  తీర్చిదిద్దేందుకు త్రిముఖ వ్యూహం-ఈ ఓ లవన్న

శ్రీశైల దేవస్థానం: శ్రీశైల క్షేత్రాన్ని మరింతగా  తీర్చిదిద్దేందుకు త్రిముఖ వ్యూహం తో ముందుకు పోతున్నామని ఈ ఓ  ఎస్. లవన్న చెప్పారు. దేవస్థానంలో బుధవారం  73వ గణతంత్ర దిన  వేడుకలు జరిగాయి.ఈ సందర్భంగా దేవస్థాన పరిపాలనా కార్యాలయ భవనం ప్రాంగణంలో జాతీయ పతాకావిష్కరణ కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ముందుగా ఆలయ సంప్రదాయాన్ని అనుసరించి మహాగణపతిపూజ  తరువాత జాతిపిత మహాత్మగాంధీ చిత్రపటానికి పుష్పమాలను అర్పించారు.అనంతరం దేవస్థానం రక్షణ సిబ్బంది,  దేవస్థానంలో విధులు నిర్వహిస్తున్న స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్, హోమ్ గార్డ్స్ సిబ్బంది పతాక వందనం చేశారు.ఆ తరువాత కార్యనిర్వహణాధికారి ఎస్.లవన్న  జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం జాతీయగీతం ఆలాపించారు

 కార్యనిర్వహణాధికారి ఎస్.లవన్న  ప్రసంగిస్తూ గత సంవత్సర కాలం లో దేవస్థానం సాధించిన ప్రగతిని వివరించారు.

శ్రీశైల మహాక్షేత్ర అభివృద్ధికి దేవస్థానం పలు చర్యలు చేపట్టిందన్నారు. ఇందుకు ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్‌రెడ్డి,

 దేవదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్, స్థానిక శాసనసభ్యులు  శిల్పాచక్రపాణిరెడ్డి, దేవదాయశాఖ ప్రత్యేక ప్రధానకార్యదర్శి డా.వాణీమోహన్ , దేవదాయశాఖ కమిషనర్ డా. హరిజవహర్ లాల్  ఎప్పటికప్పుడు ప్రోత్సహిస్తూ పూర్తి సహాయసహకారాలను అందిస్తున్నారన్నారు.దేవస్థానం పక్షాన వారికి ధన్యవాదాలు తెలియజేశారు.

వైదిక కార్యక్రమాలను శాస్త్రోక్తంగా  నిర్వహించడం, భక్తులకు సౌకర్యాల కల్పన, క్షేత్రాభివృద్ధికి  త్రిముఖ వ్యూహంతో  ముందుకెళ్ళడం లక్ష్యమని ఈ ఓ చెప్పారు.ఒకవైపు అభివృద్ధి కార్యక్రమాలతోపాటు మరోవైపు శ్రీశైల క్షేత్రాన్ని మరింతగా  అధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు.

 ఉత్సవాల నిర్వహణ, కోవిడ్ నివారణ చర్యలు, లోకకల్యాణార్థం ముఖ్యంగా కరోనా వ్యాప్తి అరికట్టేందుకు ఆలయంలో  హోమాలు, వెబ్ సైట్ ఆధునీకరణ, శ్రీశైలపరోక్షసేవ, మొక్కలు నాటే కార్యక్రమం, మాస్టర్‌ప్లాన్ (బృహత్తర ప్రణాళిక), అమ్మవారి యాగశాల నిర్మాణం, పంచమఠాల పునరుద్దరణ,వసతి సౌకర్యాల కల్పన, ప్రసాద్ పథకం కింద  పనులు, భక్తులు సమర్పిస్తున్న విరాళాలు, క్యాలెండర్లు, డైరీల ముద్రణ,హుండీరాబడి, శ్రీశైలటీవి, క్షేత్రపరిధిలో పారిశుద్ధ్య నిర్వహణ, డయల్ యువర్ ఈఓ, ఉద్యోగుల సంక్షేమం మొదలైన అంశాల గురించి ఈ ఓ  ప్రస్తావించారు.

చేపట్టనున్న పనులలో భాగంగా ఏనుగులచెరువుకట్ట అభివృద్ధి,  సుందరీకరణ, ఆలయ మాడవీధుల (శివవీధుల) సుందరీకరణ, పశ్చిమమాడవీధిలోని గ్యాలరీ నిర్మాణం, నూతనంగా ప్రస్తుత గోశాల ఎదురుగా నిర్మించితలపెట్టిన మరో గోశాల నిర్మాణం, మొదలైన అంశాల గురించి ఈ ఓ  పేర్కొన్నారు.

print

Post Comment

You May Have Missed