భ్రమరాంబికా వాణిజ్య సముదాయం ప్రారంభం

 శ్రీశైల దేవస్థానం:లలితాంబికా దుకాణాల సముదాయంలో నూతనంగా నిర్మించిన 36 గదుల వాణిజ్య సముదాయ ప్రారంభోత్సవం ఆదివారం జరిగింది.భ్రమరాంబికా వాణిజ్య సముదాయం పేర ఈ దుకాణాలు నిర్మించారు.ఈ ఉదయం గం.8.44 ని.లకు దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షులు రెడ్డివారి చక్రపాణిరెడ్డి, కార్యనిర్వహణాధికారి  ఎస్. లవన్న, ధర్మకర్తల మండలి సభ్యులు ఈ దుకాణాలను ప్రారంభించారు.ఈ కార్యక్రమం లో ధర్మకర్తల మండలి సభ్యులు మఠం విరూపాక్షయ్యస్వామి, మేరాజోత్ హనుమంత్ నాయక్, శ్రీమతి బరుగురెడ్డి పద్మజ, శ్రీమతి డా. కనకదుర్గ, ప్రత్యేక ఆహ్వానితులు  తన్నీరు ధర్మరాజు పాల్గొన్నారు. ముందుగా మహాగణపతిపూజచేసారు. తరువాత  దుకాణ సముదాయానికి ప్రారంభోత్సవం ఫలకానికి పూజాదికాలు చేసారు . అనంతరం కార్యక్రమం జరిగింది.

 ధర్మకర్తల మండలి అధ్యక్షులు మాట్లాడుతూ దేవస్థానం ఇంజనీరింగ్ అధికారులు,  సిబ్బంది అహర్నిశలు శ్రమించి ఈ నూతన దుకాణ సముదాయాన్ని నిర్మించారన్నారు. మొత్తం నాలుగు మాసాలలో దీనిని   పూర్తి చేసారు.  ఆ విభాగాన్ని ప్రశంసించారు. చివరగా ధర్మకర్తల మండలి అధ్యక్షులు దేవస్థానం ఎగ్జిక్యూటీవ్ ఇంజనీరు వి. రామకృష్ణను శాలువాతో సత్కరించారు.

దుకాణాల తాళంచెవుల అందజేత:

శనివారం  దుకాణాల కేటాయింపు డిప్పులో పాల్గొని లలితాంబికా దుకాణాల సముదాయం  లోనూ,  నూతనంగా నిర్మించిన 36 దుకాణాల సముదాయం లోనూ దుకాణాలను పొందిన వారికి ఆయా దుకాణాల తాళంచెవులు అందించే ప్రక్రియ ఈ ఉదయం ప్రారంభించారు.ధర్మకర్తల మండలి అధ్యక్షులు రెడ్డివారి చక్రపాణిరెడ్డి ఈ  కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యనిర్వహణాధికారి  ఎస్. లవన్న,  ధర్మకర్తల మండలి సభ్యుల సమక్షంలో   ఈ  కార్యక్రమం జరిగింది.

వే బ్రిడ్జి నిర్మాణానికి భూమిపూజ:

దేవస్థానం తలపెట్టిన వే బ్రిడ్జి నిర్మాణానికిగాను (ధర్మకాట నిర్మాణానికి)  భూమిపూజ జరిగింది.. వలయ రహదారి సమీపంలోని బిపిసిఎల్ పెట్రోల్ బంకు వద్ద ఈ వే బ్రిడ్జి నిర్మితమవుతుంది.

దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షులు రెడ్డివారిచక్రపాణిరెడ్డి, కార్యనిర్వహణాధికారి  ఎస్. లవన్న,  పలువురు ధర్మకర్తల మండలి సభ్యులు  భూమిపూజను నిర్వహించారు.60 టన్నుల బరువు వరకు తూచే సామర్థ్యం గల ఈ వే బ్రిడ్జి నిర్మాణపు అంచనా వ్యయం రూ. 18 లక్షలు.

ఓవర్హె హెడ్ నీటి ట్యాంకు నిర్మాణానికి భూమిపూజ:

పాతాళగంగ మార్గంలోని   నందికేశసదనం డార్మిటరీ ప్రాంగణములో నిర్మించనున్న ఓవర్ హెడ్ నీటి ట్యాంకు నిర్మాణానికి కూడా  దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షులు రెడ్డివారిచక్రపాణిరెడ్డి, కార్యనిర్వహణాధికారి  ఎస్. లవన్న,  పలువురు ధర్మకర్తల మండలి సభ్యులు  భూమిపూజను నిర్వహించారు. లక్ష లీటర్ల సామర్థ్యం గల ఈ వాటర్ ట్యాంకు నిర్మాణపు అంచనా వ్యయం రూ.16లక్షలు. ఈ కార్యక్రమాలలో ఇంజనీరింగ్, రెవెన్యూ, వసతి, ప్రజాసంబంధాల విభాగాల అధికారులు,  సంబంధిత సిబ్బంది పాల్గొన్నారు.

print

Post Comment

You May Have Missed