శ్రీశైల దేవస్థానం: విధుల్లో ఉత్తమ సేవలందంచిన పలువురు అధికారులకు , ఉద్యోగులకు ప్రశంసా పత్రాలను స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా బహూకరించారు. జిల్లా కేంద్రమైన నంద్యాలలో జరిగిన వేడుకలలో రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, మైనార్టీ సంక్షేమ శాఖామంత్రి ,జిల్లా ఇంచార్జి మంత్రి అంజాద్ బాష ప్రశంసా పత్రాలను బహూకరించారు.దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఎస్. లవన్న కూడా ఈ ప్రశంసాపత్ర బహూకరణకు ఎంపికయ్యారు.
శ్రీశైలంలో దేవస్థానం ఆధ్వర్యములో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను నిర్వహించినందున కార్యనిర్వహణాధికారి జిల్లా కేంద్రములో జరిగిన వేడుకలలో పాల్గొనలేకపోయారు. త్వరలో జిల్లా కేంద్రములోని కలెక్టర్ కార్యాలయం నుండి దేవస్థానం కార్యనిర్వహణాధికారి ప్రశంసాపత్రాన్నిపొందుతారు.